Tuesday, March 21, 2023

తూంలతో చెరువులకు జలకళ

- Advertisement -

opening

*70ఏళ్లుగా చేయలేని అభివృద్ధిని మూడెళ్లలో చేపించాం
*కరువు రహిత జిల్లాగా ఇక కరీంనగర్
-మిడ్‌మానేర్ ప్రాజెక్టు జంక్షన్
*రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రతి ఎకరాకు నీటిని అందించే దిశలో ప్రభుత్వం పని చేస్తుందని,అతి తొందరలో కరీంనగర్ జిల్లా కరువు రహిత జిల్లాగా మార బోతుందని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంలో చొప్పదండి ఎంఎల్‌ఎ బొడిగె శోభతో కలిసి శనివారం గట్టుభూత్కూర్, ర్యా లపల్లి, భూర్గుపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
మనతెలంగాణ/గంగాధర: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసా యానికి ప్రతి ఎకరాకు నీటిని అందించే దిశలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని,అతి తొందరలో కరీంనగర్ జిల్లా కరువు రహిత జిల్లాగా మారుబోతుందని తెలంగాణా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం లో చొప్పదండి ఎంఎల్‌ఎ బొడిగె శోభతో కలిసి శనివారం గట్టుభూత్కూర్,ర్యాలపల్లి,భూర్గుపల్లి గ్రామాలలో పలు అభి వృద్ధి పనుల ప్రారంభానికి మంత్రి శంకుస్థాపనలు చేశారు. యువకులు బైక్ ర్యాలీతో మంత్రికి ఘన స్వాగతం పలికి నారు. ర్యాళపల్లి ఎస్‌సి కాలనీ సిసి రోడ్డుకు 98 లక్షలు, ఆచంపల్లి నుంచి గట్టుభూత్కూర్ రోడ్డుకు 3కోట్ల 78 లక్ష లు,భూర్గుపల్లి వరద కాల్వకు తూం నిర్మాణానికి 27 లక్ష లు, ర్యాల పల్లి నుంచి గోపాల్‌రావుపేటకు రోడ్డు నిర్మాణా నికి 2కోట్ల 86లక్షలు,చొప్పదండిలో డబుల్ బెడ్‌రూం ల నిర్మాణానికి 4 కోట్ల 40లక్షల 30వేలు, రుక్మాపూర్ గురు కుల పాఠశాల రోడ్డుకు 1 కోటి 55 లక్షలు మంజూరు చేసి నట్లు భూర్గుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలి పినారు.
ఈ సందర్భంగా వారు రైతులనుద్దేశించి మాట్లాడు తూ రైతులకు నీరందించే దిశలో సిఎం కెసిఆర్ కృషి చేస్తు న్నారని, రైతుల కష్టాలను తీర్చుతామని,గతంలో శ్రీరాం సా గర్‌లో ఎంత నీరు నిల్వ ఉన్నాకాని నీటిని ఇయ్యలేదని, నే డు 18వేల క్యూసెక్కుల నీరున్నా వరుద కాలువకు నీరిచ్చి రైతులను ఆదుకున్న ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని, గోదావరి,ప్రాణహిత చేవెళ్లలో నీరున్నా కాని ఉపయోగప డకుండా ఉందని,ఇప్పుడు ఏ రాష్ట్రంలో వర్షం పడినా మిడ్ మానేరులోకి నిలుస్తుందని అన్నారు.మిడ్‌మానేరు నిండి ఎల్‌ఎండికి వరద కాల్వ ద్వారా రివర్స్ పంపింగ్‌తో ఎస్సా రెస్పీకి నీరందిస్తూ ఒక జంక్షన్‌గా ఉపయోగ పడ్తుందని అన్నారు.
70ఏళ్ల కింద జవహార్ లాల్ నెహ్రు కాలం 1960లో 14 లక్షల ఎకరాలకు నీటిని అందించే లక్షంతో శంకు స్థా పనలు చేస్తే లక్ష ఎకరాలకు కూడా నీరందని దుస్థితి గత ప్రభుత్వాలది అని, 2005లో శంకుస్థాపనలు చేసినవి 201 4లో కూడా పనులు ప్రారంభించకపోతే వాటిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆపనులను పూర్తి చేసిందని, 2006 లో 400 ల కోట్లతో వరద కాల్వ చేపట్టితే దానికి 15 వందల కోట్లుకు పెంచి పనులు పూర్తి చేసి నీరందించామని, వరద కాల్వకు తూంలు ఏర్పాటు చేసి వాటి ద్వారా చెరువులను నీటితో నింపుతామని,2018లో ప్రతి ఎకరాకు నీరందించే ఏర్పాటు లో మంత్రులు,ఎంఎల్‌ఎలు పని చేస్తున్నారని మంత్రి ఆన్నా రు.ధర్మపురి శాసన సభ్యులు కొప్పుల ఈశ్వర్ మాట్లాడు తూ వరద కాల్వకు తూంల ఏర్పాటు చేయడం తన నియో జకవర్గంలోని ప్రజలకు నీరందించడం ఆనందంగా ఉంద న్నారు. కాళేశ్వరం,ఎల్లంపల్లి నీటికోసం అధికారులు మ ంత్రులు కలిసి పనిచేస్తున్నారని, వరద కాల్వకు ఇప్పుడు నీ టి విడుదల సాధ్యం కాదని, రైతులకు ముందస్తుగా యా సంగికి పంటలు వేసుకోవద్దని తెలిపామని, అయినా దీనిని ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం సరికాదని ఆన్నారు. కా ళేశ్వరం ఎల్లంపల్లి ప్రాజెక్టులు పూర్తైతే వరద కాలువ లోకి 6 ముండి 9 మీటర్ల నీరు నిల్వ ఉంటుందని తెలిపారు.
ఎమ్మెల్సీ నారదాసు మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్ల క్షం వల్ల సమస్యలు పేరుకు పోయాయని వాటిని అంచ లంచెలుగా పనులు చేపడుతూ మౌళిక వసతులు కల్పిస్తు న్నామని అన్నారు.
ప్రజా సంక్షేమం కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం మంత్రులు ,ఎంఎల్‌ఎలు రాత్రి పగలు కష్టపడుతుంటే, కాంగ్రెస్ నా యకులు గాంధీ భవన్‌లో కూర్చొని 100 సీట్లు వస్తాయని కలలు కంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చొ ప్పదండి ఎంఎల్‌ఎ బొడిగె శోభ తో పాటు రాష్ర ్టనాయకులు బొడిగె గాలన్న,గంగాధర జడ్‌పిటిసి ఆకుల శ్రీలత,ఎంపిపి దూలం బాలగౌడ్,ఎఎంసి చైర్మన్ రేండ్ల పద్మ,భూర్గుపల్లి సర్పంచ్ అంజయ్య, గంగాధర,రామడుగు మండల ఎంపిపి లు, ఎంపిటిసిలు,సర్పంచ్‌లు,నాయకులు,కార్యకర్తలు, నీ టి పారుదల సిఇ అనిల్ కుమార్,ఎస్‌ఇ శ్రీకాంత్‌రావు, అ లాగే రైతు సమన్వయ కమిటీ సభ్యులు,రైతులు, ప్రజలు పె ద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News