Home ఆదిలాబాద్ జింక పిల్లలను స్వాధీనం చేసుకున్న అటవీ సిబ్బంది

జింక పిల్లలను స్వాధీనం చేసుకున్న అటవీ సిబ్బంది

deersలోకేశ్వరం : మండలంలోని పుస్పూర్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన లక్ష్మీనగర్ తండాలో ముందస్తు సమాచారం మేరకు మూడు జింకపిల్లలను స్వాధీన పర్చుకున్నట్లు భైంసా ఫారెస్టు ఆఫీసర్ ముజాయిత్ ఆలీ తెలిపారు. గత కొంత కాలం నుంచి వన్యమృగాలను వేటాడుతున్నట్లు తమకు సమాచారం తెలి యడంతో నిర్మల్ ఫారెస్టు రెంజ్ ఆఫీసర్ ఇదాయత్ ఆలీ లక్ష్మీనగర్‌తండాకు వెళ్లామని ఆయనన్నారు. గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులను ఆరా తీయగా తమ గ్రామంలో జింక పిల్లలు లేవని, వన్యమృగాలను వేటాడడం లేదని తెల్పగా వెంటనే భైంసా, నిర్మల్ ఫారెస్టు అధికారులకు గ్రామంలో తనిఖీలు చేశారు. దీంతోగ్రామానికి చెందిన నగేంధర్ వద్ద మూడు జింక పిల్లలు ఉండడంతో జింక పిల్లలను స్వాధీనం చేసుకొని, నిందితుడు నాగేంధర్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎవరైనా వన్యమృగాలను వేటాడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరివెంట భైంసా అటవీశాఖ అధికారి అఫీజ్, నిర్మల్ అటవీశాఖ అధికారి ఖాదల్, నర్సాపూర్ ఎఫ్‌ఆర్‌ఓ సిరానంద్, నిర్మల్ ఎఫ్‌ఆర్‌ఓ ఇదాయత్ ఆలీ, తదితరులున్నారు.