* అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న కెసిఆర్
*ప్రజల ఆకాంక్షలు విస్మరించిన ప్రభుత్వం
* రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
* పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు తేజావత్ బెల్లయ్యనాయక్
మనతెలంగాణ/మహబూబాబాద్ టౌన్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసి ఆర్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను విస్మరించి కుటుంబ ప్రయోజనాల కోసమే అధికారాన్ని సద్విని యోగం చేసుకుంటుండని కెసిఆర్ పాలనకు చరమగీతం పాడి రాబో యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పిసిసి రాష్ట్ర అధికార ప్రనిధి అద్దంకి దయాకర్, ఎఐసిసి ఎస్టి సెల్ ఉపాధ్య క్షులు తేజావత్ బెల్లయ్య నాయక్‌లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లో కాంగ్రేస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. తెలంగా ణ వస్తే ఉద్యోగాలు, నీళ్లు, నిధులు వస్తాయని, భాష, సంస్కృతిని కాపా డుకుంటామని ఆశించిన రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మొండి చేయి చూపిందని విమర్శించారు. 1200 మంది ఆత్మ బలిదానాలను, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి, వారి ఆత్మ గౌరవాన్ని గౌరవిం చిన సోనియమ్మ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుని ఆంధ్రప్ర దేశ్‌లో ఎంపి, ఎమ్మెల్యేలు లేకున్నా పర్వాలేదని తెలంగాణే ముఖ్యమని తలచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పటికి టిఆర్‌ఎస్‌కు సపోట్ చేసి గెలిపించి కేసిఆర్‌ను గద్దెనెక్కిస్తే ఆంధ్ర పెట్టుబడి దారులకు కొమ్ము కాస్తూ తెలంగాణనే తాకట్టు పెట్టి బ్రోకరిజం చేస్తుండన్నారు. కేసిఆర్ పాన నుండి రాష్ట్రాన్ని కాపాడు కోవాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో దోచుకున్న మాదిరిగానే గడిచిన నాలుగు సంవత్సరాలలో కేసిఆర్ ఆదేపని చేశాడని మండిపడ్డారు. ఆంద్రోళ్ళను తీసుకొచ్చొ సన్మానాలు చేయడం ఇందేమి సంస్కృతి టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేసిఆర్ అధికారం లోకి వచ్చిన కూడా తెలంగాణలో అడుకోవడం మానలేదన్నారు. ముఖ్య మంత్రి కంటే అడుకు తినేవారికే ఆత్మగౌరవం ఉందని అన్నారు. బంగారు తెలంగాణ ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రేస్ హయాంలోనే విద్యా, ఉద్యోగ, వైద్యారంగా అభివృద్దికి కట్టుబడి ఉందన్నారు.
కాంగ్రేస్ ను ఎదురుకోవడం కేసిఆర్‌కు చాత కాదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు విస్మరించాడని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి, బ్యాంకు రుణాల మాఫీ, 12 శాతం గిరిజనుల రిజర్వేషన్, ఇంటికో ఉద్యోగం, ఉచిత విద్యఅమలు, సబ్ ప్లాన్ నిదులు, నిరుపేదల కు డబుల్ ఇండ్లు ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి నిధుల దుర్వినియోగాని పాల్పడుతూ.. కుటుంబ పాలన చేస్తుండని హెద్దేవ చేశారు. తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్ని అన్న కేసిఆర్ ఆవిషయాన్ని డైవర్టు చేస్తూ రోజుకో కల్లబొల్లు మాటలు చెబుతుండన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉంచుతున్నాడని పేర్కొ న్నారు. ముఖ్యమంత్రే అన్ని కొలువులు చేస్తూ రాచరీక పాలనను తలపి స్తుండన్నారు 70 సీట్లు రాకుంటే ఉత్తమ్‌కుమార్ రాజకీయ సన్యాసం తీసుకుంటాడు 100 సీట్లు రాకుంటే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా అని ముఖ్యమంత్రికి, కేటిఆర్‌కు సవాళ్ళు విసిరారు. కాంగ్రేస్ ఇచ్చిన తెలంగాణను అబాస్ పాలు చేస్తున్న కేసిఆర్‌కు బద్ది చెప్పాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపా డుతుందన్నారు. 2 లక్షల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ నిర్మూలన ఉంటుందన్నారు. గతంలో మాదిరి ఏకకాలంలోనే రైతు రుణాలు మాఫి చేస్తామన్నారు. దమ్ముంటే పోటికి రా.. అని పిలుపునిచ్చారు. రాబోయే 2019 ఎన్నికల్లో కాంగ్రేస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ నేతలు భూక్య శ్రీనివా స్, రామచంద్రు, గాడిపల్లి వెంకన్న, వెంకన్న, గుగులోత్ వెంకట్, శ్రీధర్, ఆరుద్ర చారి, కొమ్మరాజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.