Home రాష్ట్ర వార్తలు ప్రకృతి ఒడికి వీడ్కోలు

ప్రకృతి ఒడికి వీడ్కోలు

vlg

ఇకముందు ఆ రెండు గ్రామాలకు
పక్షుల కిలకిలల విందులుండవు

 కవ్వాల్ టైగర్ జోన్ నుంచి తరలిపోనున్న రాంపూర్, మైనంపేట వాసులు

మంచిర్యాల: అడవులతో పెనవేసుకున్న బంధాలు తెగి పోయే సమయం ఆసన్నమైంది. పక్షుల కిలకిలారావాల మధ్య జీవించే గిరిజనులు త్వరలోనే అందుకు దూ రం కానున్నారు. పులుల ఆవాసం గా మారిన ప్రాంతంగా గుర్తించి రెం డు గ్రామాలను ప్రభుత్వం ఖాళీ చేయిస్తుండగా గిరిజనులు ఖాళీ చే సేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇ టీవలి కాలంలో పులులు అలికిడిని తట్టుకోలేక గిరిజనులు మహారాష్ట్ర వైపు పరుగులు తీస్తుండగా ప్రభు త్వం స్పందించి అడవి మధ్యలో ఉ న్న రెండు గ్రామాలను ఖాళీ చే యిం చేందుకు సన్నాహాలు చేస్తోంది. క వ్వాల్ టైగర్ జోన్ ప్రాంతంలోని రెండు గ్రామాలను ఖాళీ చేయించి, వారికి మౌలిక సదుపాయాలతో పా టు పునరావాసం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గిరిజన గూడాల్లో ఆందోళన మొదలైంది. మొదటగా రెండు గ్రామాలను తరలించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మైసంపేట రాంపూర్, అల్లీనగర్, దొంగపల్లి గ్రామాల తరలింపుకు అప్పటి జిల్లా కలెక్టర్ జగన్మోహన్ గిరిజనులకు అవగాహన కల్పించారు. వీరికి ఇండ్ల నిర్మాణాలతో పాటు రోడ్డు పక్కన పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ గిరిజనులు అంగీకరించలేదు. అయితే ప్రస్తుతం కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని రాంపూర్ గ్రామంలో 27 కుటుంబాలను, మైనంపేట నుంచి 84 కుటుంబాలను తరలించేందుకు పంపించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ రెండు గ్రామాలను మొదటి దశలో ఖాళీ చేయించేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న గిరిజనులను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు.
కడెం మండలం పెద్దూర్ గ్రామ సమీపంలో దాదాపు 600 ఎకరాల్లో అధికారులు రెండు గ్రామాల గిరిజనులకు పునరావాసం కల్పించేందుకు ఏ ర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్క కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం సైతం గిరిజనులకు కొద్దిమేరకు పరిహారం అందించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీలో తీర్మానాన్ని ఆమోదించి రెండు వారాల్లోగ్రామాలను ఖాళీ చేయించేందుకు సిద్ధం అవుతున్నారు.
మైనంపేట గ్రామం రహదారి సౌకర్యానికి నో చుకోక దట్టమైన అడవిలో ఉండగా కాలి నడకన వెళ్లాలంటే గ్రామస్థులు భయపడుతున్నారు. అదే విధంగా రాంపూర్ గ్రామం రహదారిని ఆనుకోని ఉన్నప్పటికీ మౌళిక సౌకర్యాలు కరువైవయ్యాయి. ఈ రెండు గ్రామాల్లో గిరిజనులు సుముఖంగానే ఉన్నప్పటికీ మరో మూడు గ్రామాల గిరిజనులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అల్లీనగర్ , దొంగపల్లి గ్రామాలలో సర్వేలు కొనసాగుతుండగా గిరిజనులు అడ్డుకుంటున్నారు.అటవీశాఖ, హైదరాబాద్ టైగర్ కంజర్వేషన్ అథార్టీ సంయుక్తంగా ఇక్కడ సర్వే చేస్తుండగా గిరిజనుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ రెండు గ్రామాలకు పునరావాసం కల్పించేందుకు గాను బాధంపల్లి సమీపంలో ఉన్న సుమారు 250 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. కాగా తిర్యాణి మండలం కొక్కిగూడ గ్రామంలోని 8 కుటుంబాల గిరిజనులను సైతం టైగర్ జోన్ నుంచి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏదిఏమైనా దశాబ్దాల కాలంగా అడవులను నమ్ముకొని దట్టమైన అటవీ ప్రాంతంలో జీవనం గడుపుతున్న గిరిజనులు ఇకముందు అడవులకు దూరమై మైదాన ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. గిరిజన గ్రామాల తరలింపుపై గిరిజనులలో నిరాసక్తత వ్యక్తం అవుతుంది.