Home Default జిఎం భారత్‌లో సేల్స్ ఆపడానికి కారణాలేంటి?

జిఎం భారత్‌లో సేల్స్ ఆపడానికి కారణాలేంటి?

GMన్యూఢిల్లీ: అమెరికా వాహన తయారీ దిగ్గజం జనర ల్ మోటార్స్ (జిఎం) భారత్‌లో కార్ల విక్రయా లను నిలిపివేయడానికి కారణాలేమిటి? అంటే కొన్ని విని పిస్తున్నాయి. కార్పొరేట్ వ్యవస్థలో తరచూ మార్పుల ఫలితంగా దీర్ఘకాలిక వ్యూహాలకు విఘాతం ఏర్పడ డం వల్ల కంపెనీ ఈ నిర్ణయానికి వచ్చిం దని తెలు స్తోంది. ఇంకా ఇతర కారణాలు కూడా వినిపిస్తు న్నాయి. 21 ఏళ్లలో 9 మంది సిఇఒలు మారడం.. అంటే రెండున్న ఏళ్ల అతి తక్కువ కాలం ఒక్క సిఇఒ పనిచేశారు. అదే మారుతీ సుజుకీ సంస్థలో 35 ఏళ్లలో ఐదుగురు సిఇఒలు ఉన్నారు. దివాళా, 2008 ఆర్థిక మాంద్యం వంటి ఆందోళనలు అంత ర్జాతీయ ఆపరేషన్లపై ప్రభావం చూపాయి. జన రల్ మోటార్స్ భారత్‌లో కార్ల విక్రయాలను నిలిపి వేయ డం ఈ వాహన అమ్మకాలపై  తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గురువారం నాటి ప్రకటన తరువాత నుంచి క్రమంగా ఈ విక్రయాలు  పడిపోతున్నాయి. ఈ ధోరణి ఇకముందుకూడా కొనసాగనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. జిఎం ప్రకటించిన తరువాత రీసేల్ మార్కెట్లో  5శాతం పడిపోయాయి. రాబోయే రోజుల్లో 20 శాతం తగ్గుతాయని భావిస్తు న్నారు. ఈ సంవత్సరం ఆఖరు నుంచి భారత్‌లో విక్రయాలను నిలిపివేయాలని జిఎం నిర్ణయించింది. తీవ్ర పోటీ వాతావరణంలో రెండు దశాబ్దాలుగా నిల దొక్కుకునే ప్రయత్నం చేసిన ఈ కంపెనీకి భారత్‌లో ఎలాంటి అదృ ష్టం కలిసి రాలేదు. భారత్‌లో ఈ కం పెనీ ప్యాసెంజర్ కారు అమ్మకాలు ఒక శాతం కంటే తక్కువగా నమోదవు తున్నాయి. ఇటు అమ్మకాలు పెంచుకోలేని జనరల్ మో టార్స్ భారత్ నుంచి నిష్క్రమిం చాలని నిర్ణయించింది.

గత నెలలో గుజరాత్ లోని హలోల్ వద్ద తొలి ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత మహా రాష్ట్రలోని టలేగావ్ తయారీ ప్లాంట్ నుంచి వాహనాలను ఎగుమతి చేయడంపైనే ప్రస్తుతం కంపెనీ దృష్టి పెట్టిం ది. పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ తెలి పింది. విక్రయాలు ఆపివేసినా దేశీయంగా తయారీ కొనసాగిస్తామని కంపెనీ పేర్కొంది. ఇక్కడ తయా రీని పెంచి, ఇతర దేశాల్లో ఈ కార్లను విక్రయించనుంది. భారత్ నుంచి ఎక్కు వగా మెక్సికో, లాటిన్ అమెరికా దేశాలకు జనరల్ మోటార్స్ తన కార్లను ఎగుమతి చేస్తోంది. ఈ ఏడా ది  ఎగుమతులు రెట్టింపు చేయాలని జనరల్ మోటా ర్స్ నిర్దేశించుకుంది.  విక్రయాల నిలిపివేతతో భారత విక్రయ సంస్థ చేవ్రొలెట్ సేల్స్ సంస్థను కంపెనీ మూసివేయనుందని ఈ తయారీసంస్థ భారత అధినేత చెప్పారు.

General Motors has given up on the Indian consumer