Thursday, November 7, 2024

‘చెక్’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

The release date of movie 'Check' has been finalized

 

నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న ‘చెక్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు -నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ “జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలాచేరుకున్నాడన్నది ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌కి చక్కటి స్పందన లభించింది. ఇందులో కథానాయికలు రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ పాత్రలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి” అని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News