Wednesday, March 29, 2023

ఫిర్యాదు చేసినా అధికారుల స్పందన కరువు

- Advertisement -

cpi

మన తెలంగాణ/రాజంపేట్: సమస్యలపై ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించడంలో విఫలమయ్యారని సిపిఐ జిల్లా కార్యదర్శి బత్తుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం మం డల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాజంపేట్ మండల కేంద్రంలో ఊర చెరువు పనులు నాసిరకంగా అ లాగే చెరువు నుండి మొరం, మట్టి, నాలుగు మీటర్ల లోతు వరకు ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారని దీనిపై గ తంలో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చే పట్టలేదని వారు మండిపడ్డారు. ప్రజావాణిలో ఫిర్యాదు చే సినా స్పందన లేదని వారన్నారు. ప్రజలను ప్రజావాణి పే రుతో మభ్య పెడుతున్నారని సమస్యలను పరిశ్కరించడం లో విఫలమవుతున్నారని ఇదివరకు పలు విషయాలపై సం బంధిత ఇరిగేషన్ డిఈ ఫిర్యాదు చేసినప్పటికిని ఈ తెలంగాణ ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తుందన్నారు. మిషన్ కాకతీయ కమీషన్ కాకతీయగా మారిందని జేబులు నింపుకోవడానికే పరిమితమైందని రెండవ విడుత మూడవ విడు త పనులు ఎక్కడి కక్కడ ఆగిపోయాయని ఆగిన పనులు పూర్తి కాకుండా ప్రభుత్వం నాలుగవ విడుతకు సిద్దమైంద ని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించక పోతే కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మండలాల తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దుబ్బల భీమయ్య, రామగొళ్ల గంగయ్య, పాముల నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News