Tuesday, March 21, 2023

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

- Advertisement -

 

body
మన తెలంగాణ లోకేశ్వరం: శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు లోకేశ్వరం ఎస్‌ఐ రమేష్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం ముథోల్ మండలం ఎడ్‌బిడ్ గ్రామానికి చెందిన సట్టి రమేష్ అనే వ్యక్తి ఉట్నూర్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజువారి విధుల్లో నిమిత్తంగా విధులు పూర్తిచేసుకుని సాయంత్రం తిరిగి తన స్వగ్రామం ఎడ్‌బిడ్‌కి తన ద్విచక్ర వాహనం(ఎపి 01 0206)పై బయలుదేరాడు. మార్గ మధ్యలో లోకేశ్వరం మండలం సేవాలాల్‌తాండా వద్దకు చేరుకున్నాడు. అయితే రమేష్ నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక వైపు నుండి వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఓవర్‌టేక్ చేయబోయి రమేష్ వాహనాన్ని ఢీకొట్టగా రమేష్ కల్వర్టులో పడి తలకు తీవ్రమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఓవర్‌టేక్ చేయబోయిన వ్యక్తి అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ఎస్‌ఐ తెలిపారు. మృతుని భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles