* రాజీవ్ రహదారిపై ప్రమాదం
* పదమూడు మందికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం
* డ్రైవర్‌కు అదనపు డ్యూటి వల్లే ప్రమాదం అంటూన్న ప్రయాణికులు
మనతెలంగాణ బెజ్జంకి ః ఆర్టిసి బస్సు బోల్తా పడి 13 మంది గాయపడిన సంఘటన బెజ్జంకి మండలంలోని రాజీవ్ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే శుక్రవారం రోజు తెల్లవారు జామున కరీంనగర్ జిల్లా డిపోకు చెందిన టిఎస్ 02 జడ్ 0304 నంబర్ గల సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుండి 19 మంది ప్రయాణికులను ఎక్కించుకొని కరీంనగర్‌కు వస్తున్న క్రమంలో బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామా శివారులోని రాజీవ్ దారిపై సూమారు 3.30-4 గంటల సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు కింద పడిపోగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ప్రయాణిస్తున్న కరీంనగర్, వరంగల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన 12 మంది ప్రయాణికులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అయితే డైవర్‌కు అదనపు డ్యూటి వేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహాం వ్యక్తం చేసినట్టు తెలిసింది. బాధితులను సిద్దిపేట జిల్లానుండి మెరుగైన చికిత్సకోసం కరీంనగర్ జిల్లా డిపోనుండి ప్రత్యేక బస్సును పంపించారు. కరీంనగర్ జిల్లా డిపో మేనేజర్ దర్మ, కంట్రోలర్ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరీశీలించి వివరాలు తెలుసుకున్నారు.