- Advertisement -
మనతెలంగాణ / ఇబ్రహీంపట్నంటౌన్ : ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద టీమాస్ ఆధ్వర్యంలో రెండవరోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మస్కు నర్సింహ మాట్లాడుతూ..గత ఎన్నికల ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక హామీలను ఇచ్చి అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందాయని అన్నారు. స్థానికంగా ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలో అనేక సమస్యలున్నాయని టీమాస్ ఆధ్వర్యంలో పర్యటించి సమస్యలను గుర్తించామన్నారు. అధికారుల దృష్టికి సమస్యలు తీసుకుపోయినప్పటికి పరిష్కరించడం లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీమాస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -