Friday, March 31, 2023

మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం

- Advertisement -

cele

మన తెలంగాణ / ముప్కాల్ : మాటలను చెప్పడం క దు చెప్పిన మాటలను నెరవెర్చి చూపించచే ప్రభుత్వం తమదని తెరాస మండల అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి అన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో గురువారం జరుపుకున్న సంబరాల్లో భాగంగా ఆయన మాట్లాడు తూ.. గత వారం రోజులుగా రైతులు కొనసాగిస్తున్న ఎర్రజొన్న మద్దతు ధర దీక్షలకు ప్రభుత్వం వెంటనే స్పందించిన తీరు హర్షణీయమన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుతంత్రాలు పన్ని రైతులను రెచ్చగొట్టె కార్యక్ర మం ఎన్ని చేపట్టినా అవన్నీ తమ పార్టీ ముందు వృదా రైతులను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కెసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదన్నారు.
స్థానిక సర్పంచ్ ముస్కు భూమేశ్వర్ మాట్లాడుతూ….
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎర్రజొన్నలకు రూ. 2300 ల మద్దతు ధర ప్రకటించడమ చాలా సంతోషం గా ఉందని అన్నారు. ఈ ప్రకటన రావడాని కృషి చేసిన ఎంపి కవితకు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి లకు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద టిఆర్‌ఎస్ నాయకులు బాణా సంచా పేల్చి, రైతులకు మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఆర్గుల రాదా చిన్నయ్య, ఎంపిటిసి సభ్యులు పెంటు గంగాధర్, ఉప సర్పంచ్ కట్ట మహేష్, వేల్పూర్ మార్కెట్ కమిటి చైర్మన్ పుట్ట లలతి, తుక్కన్న, రైతు సమన్వయ కమిటి అధ్యక్షులు గడ్డం ప్రతాప్ రెడ్డి, వేంపల్లి సోసైటి చైర్మన్ సంతోష్‌రెడ్డి, మైనార్టీ టిఆర్‌ఎస్ అధ్యక్షులు మునిరోద్దిన్, రాజు, నర్సయ్య, ముత్తెన్న, శ్యామ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News