Home తాజా వార్తలు హామీలను మరచిన రాష్ట్ర ప్రభుత్వం

హామీలను మరచిన రాష్ట్ర ప్రభుత్వం

The state government forgets the guarantees

మన తెలంగాణ/అల్లాదుర్గం : టిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలో విద్యార్థులకు, యువతకు ఇచ్చిన పలు హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్‌ఆర్‌సిపి ఉమ్మడి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు టి.నరేష్ ఆరోపించారు. సోమవారము నాడు అల్లాదుర్గం మండలంలోని చిల్వర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థుల కోసం కేజీ టూ పిజీ విద్యను అమలు చేస్తామని చెప్పిన కెసిఆర్ విద్యార్థులను, యువతను మోసం చేస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు. సిఎం కెసిఆర్ విద్యార్థులపై సవితి తల్లి ప్రేమ చూపుతూ విద్యార్థులను అణగదొక్కె విధానాలను అవలంభిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇటీవల జరిగిన టిఆర్‌ఎస్ ప్లీనరీలో విద్యార్థుల సమస్యలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం విడ్డూరమన్నారు. కస్తూర్భాగాంధీ వసతి గృహాల్లో ఆంగ్ల బోధన అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్వంత ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి మెదక్ జిల్లాలోని విద్యార్థులు, యువత సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ధ చూపడం లేదన్నారు. బోధన రుసుము రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వెంటనే నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల బలిదానాలతో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ద్వందవైఖరిని అవలభిస్తున్నారన్నారు. అల్లాదుర్గంలో జాతీయ రహదారిపై బస్టాం డ్ లేక ప్రయాణికులు ఎండలో బస్సుల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని, వారి కోసం బస్టాండ్‌ను నిర్మించాలని ఆయన కోరారు. వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతో రాబోయే రోజుల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పథనం కావడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి విద్యార్థి విభాగం నాయకులు రవీ, ప్రశాంత్, మోహన్, వినోద్ తదీతరులు పాల్గొన్నారు.