* కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తున్నారు
* దారి మల్లించిన నిధులను రైతులకివ్వాలి
* త్వరలో కేంద్ర నిధుల వివరాలను వెల్లడిస్తాం
* బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి
మన తెలంగాణ/సంగారెడ్డి టౌన్ : తెలంగాణలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పా ర్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హాడావుడి ప్ర కటనలు ఆర్బాటాలు తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికలపై లేని పోని పంచాయతీలు సృష్టిస్తూ గంధరగోళానికి కృషిచేస్తున్నారన్నారు. సర్పంచ్‌ల పరోక్ష ఎన్నికలకు తెరలేపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనికి బిజెపి వ్యతిరేకమన్నారు. మరోపక్క ఒకే సారి రెండు పంటలకు పెట్టుబడిని ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఒకే పంటకు ఇస్తామని చెబుతుందని అది పంట పెట్టుబడి కాదు ఓట్ల పెట్టుబడి అని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. రైతులు ఆమాయకులు కాదని, ప్రభుత్వం చేసే కుట్రను గమనిస్తున్నారన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద కేంద్రం 721కోట్లను ప్రకటిస్తే నేటికి రైతులకు చేర్చలేదని ఆరోపించారు. రైతులు నష్టపోకుండా ఫసల్‌భీమా యోజన అనే పేరుతో కేంద్రం ఓ మంచి పథకాన్ని ప్రవేశపెడితే రాష్ట్రంలో ఎక్కడ కూడా అ మలు చేసిన దాఖలాలు లేవన్నారు. రైతులకు ఈ పథకంపై అవగాహన కల్పించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రుణమాఫీ చేసిన పాస్‌పుస్తకాలు ఇంకా బ్యాంకుల్లో ఎందుకున్నాయని ప్రశ్నించి ఎన్నికల కొరకే పెట్టుబడి పేరుతో ప్రభుత్వం హాడావుడి చేస్తుందన్నారు. దారి మల్లించిన నిధులను వెంటనే రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలను సైతం కాలపరిమితి ముగిసాకే నిర్వహించాలని, పరోక్ష ఎన్నికలకు బిజె పి వ్యతిరేకమన్నారు. గ్రామాల అభివృద్దికి రాష్ట్రప్రభు త్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్నారు. గ్రా మాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం నుంచి వచ్చే 14ఆర్థిక సంఘం నిధుల నుండే అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని టిఆర్‌ఎస్ ప్ర భుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ దళితులకు ఇవ్వాల్సిన మూడెకరాల భూమిని ఇవ్వాలని, లక్ష ఉద్యోగాల్లో ఇప్ప టి వరకు 20వేలు మాత్రమే ఇవ్వడం జరిగిందని, మిగిలిన వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్ర జా వ్యతిరేకవిధానాలపై బిజెపి కార్యాచరణతో ముందుకువెళ్తుందని, కేంద్రం నుంచి ఏ ఏ శాఖ నుండి ఎన్నెన్ని నిధులు రావడం జరిగిందో వాటన్నింటి వివరాలు త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని వెంటాడతామన్నారు. సమావేశం లో జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే నందీశ్వర్‌గౌడ్, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, సతీష్.జి, జిల్లా ఇన్‌చార్జి శ్రీవాత్సవ్‌రెడ్డి, జగన్, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు విష్ణువర్థన్ పాల్గొన్నారు.