– విచారణ చేపట్టిన ఎసిపి సత్యనారాయణ
– మనుమరాలి మృతికి అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు
మనతెలంగాణ/కమలాపూర్(గూడూరు): ఓ విద్యార్థిని అనుమానస్పదంగా మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా రూరల్ కమలాపూర్ (గూడూరు) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సై పాటి నాగబాబు తెలిపిన వివరాల ప్రకారం గూడూరు గ్రామానికి చెందిన పిల్లల కరుణాకర్ మొదటి భార్య పెద్ద కూతురు పిల్లల కావేరి(16) కరుణాకర్ గూడూరు గ్రామానికి చెందిన పిల్లల శ్రీదేవితో 17 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వారికి కావేరి, దీపికలు ఇద్దరు కుమార్తెలు కలరు. కాగా శ్రీదేవి మృతిచెందడంతో కరుణాకర్ హారికను రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కలరు. శ్రీదేవి పెద్ద కూతురు కావేరి కమలాపూర్‌లోని కేరళ మోడల్ స్కూల్‌లో పదవ తరగతి విద్యనభ్యసిస్తోంది. గత కొంత కాలంగా కావేరి థైరాయిడ్ వ్యాధితో బాధపడుతుంది. తండ్రి కరుణాకర్ అయ్యప్ప మాలధారణ చేపట్టి విరమణ కోసం నాలుగురోజుల క్రితం శబరిమలకు బయలుదేరారు. ఇంట్లో పిన తల్లి హారిక ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. శుక్రవారం రాత్రి అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఒక ఇంట్లో నిద్రించగా తెల్లవారు జామున బాత్‌రూంకని బయటకు వచ్చింది. తదనంతరం కావేరి పడుకున్నది పడుకున్నట్లుగానే అనుమానస్పద స్థితిలో చనిపోయి ఉంది. విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించగా ఎసిపి సత్యనారాయణ, సిఐ కిషన్‌ల ఆధ్వర్యంలో పోలీసులు మృతిపై విచారణ చేపట్టి వివరాలు సేకరించారు. కాగా మృతురాలి అమ్మమ్మ భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నట్లు ఎస్సై పాటి నాగబాబు తెలిపారు.