Home తాజా వార్తలు ఆర్‌టిసి కార్మికుని ఆత్మహత్య

ఆర్‌టిసి కార్మికుని ఆత్మహత్య

Suicide

 

మహబూబాబాద్ : మనస్తాపంతో ఆర్‌టిసి కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడమండలం ఎల్లంపేట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం… ఎల్లంపేట గ్రామానికి చెందిన ఆవుల నరేష్(45) గత 15 సంవత్సరాలుగా ఆర్.టి.సి. డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం జరిగిన ఆందోళన కార్యక్రమంలోనూ పాల్గొన్న నరేష్ సమస్య పరిష్కారం కాలేదని తీవ్ర మదన పడ్డాడు.

బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు అతను మృతి చెందినట్లుగా చెప్పారు. అయితే ఆర్టీసి డ్రైవర్ నరేష్ ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని విపక్షాలు, విద్యార్థి సంఘ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఆర్టీసి బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనలను విరమింపజేశారు.

The Suicide of an RTC worker