Home సూర్యాపేట ఇద్దరు విద్యార్థినిల ఆత్మాహత్యాయత్నం

ఇద్దరు విద్యార్థినిల ఆత్మాహత్యాయత్నం

 

STUDENT* తల్లిదండ్రులు మందలించారని ఒకరు-తండ్రి పట్టించుకోవడంలేదని మరొకరు

మన తెలంగాణ/సూర్యాపేట : ఇద్దరు విద్యార్థినిలు వేరువేరుగా ఆత్యహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని పెన్‌పహడ్ మండలంలో చోటు చేసుకుంది. గురువారం వారి తల్లిదండ్రులు తెలిపిన వివ రాల ప్రకారం మండలంలోని అనాజీపురం గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ధరావత్ కళ్యాణి దుపాడు గ్రామానికి చెందినది. కుంటుంబ సమస్యల నేపద్యంలో కళ్యాణి మందలించడంతో తన ఇంటి వద్దే పురుగుల మందు తాగి ఆత్యహత్యకు పాల్పడింది. ఇంటర్మీడియట్ చదువుతున్న మరో విద్యార్థిని ఒగ్గు మమత నాగులపహడ్ గ్రామాన్నికి చెందినది. ఇటీవలే మమత తల్లి మృతి చెందడంతో తండ్రి తనను పట్టించుకోవడంలేదని మస్తాపానికి గురై హాస్టల్ గదిలో ఉన్న పినాయిల్  తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇరు వురు విద్యార్థినిలు ప్రసుతం సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు.  వైద్యులు వారికి ఎటువంటి ప్రాణాహాని లేదని చెప్పడంతో అటు తల్లిదండ్రులు ఇటు పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.