*సహకార సంఘం భూమిపూజలో మంత్రి ఈటల
మనతెలంగాణ/వీణవంక: రైతు కన్నీళ్ల గోస తెలిచిన రైతు బిడ్డలంగా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల,రైతుల కన్నీళ్లను తుడువడమే లక్షంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం వీణవంక మం డలం కేంద్రంలో సహకార భవన నిర్మాణానికి భూమి పూజ, నర్సింగాపూర్ గ్రా మంలో నిర్మించే గోదాంనకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంత రం చైర్మన్ మాడ సాదవరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో ఉన్న పాలకులు రైతులకు నీరు,విద్యుత్,ఉద్యోగాల కల్పనలో విఫలమైనాయని అన్నారు. విత్తనాలు, ఎరువులు సరిపడా అందించకుండా నేడు అనేక వి ధాలుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజాక్షేత్రంలో సమస్యలు తెలిసిన నాయకుడిగా,మీబిడ్డగా అభివృద్ధి ఆపదలో ఎల్లవేళలా మీ వెంట ఉంటాన ని రైతు బిడ్డగా రైతు కష్టం తెలిసిన వాడిగా వాటి నివారణకు కృషి చేస్తానని అ న్నారు. మండలంలో రైతుల పంటలను కాపాడటానికి మెదక్ నుంచి సింగూరు జలాలను తెప్పించి పంటలను కాపాడటం జరుగుతుందన్నారు.
రాబోయే రోజులలో వీణవంక మండలంనకు నీళ్లహారాన్ని అందించడం జరుగుతుందని అన్నారు.మానేరు,వీణవంక వాగులపై చెక్‌డ్యాంలతో ఈప్రాంతం అ ంతా సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. వీణవంక చెరువును కాల్వల నీటితో నింపడానికి కెనాల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చె రువు బాగుంటేనే చెట్టూ,చేమా సమస్త జీవరాసుల బతుకు,రైతుల జీవితాలు బా గుంటాయని అన్నారు. సమస్యలు తెలియని నాయకులు రాజకీయాలు చేస్తారని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాజేందర్ అన్నకు మనంఅందరం అండగా ఉండాలని పేదల ఆకలి తెలిసిన నాయకునిగా మంత్రి ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకర్తగా ఉన్నారని పెద్దపల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సమస్యలను ,పేదల ఆకలి విలువ తెలిసిన నాయకుడిగా ప్రభుత్వంలో ఎంతోవిప్లవాత్మక మార్పులకు రూపశిల్పి రాజేందర్ అన్న అని ఎంఎల్ సి నారదాసు,జడ్‌పి చైర్మన్ తుల ఉమ పేర్కొన్నారు.
మంత్రి ఈటెలకు సహకార సంఘం పాలకవర్గం గజమాలతో సన్మానించారు. సమావేశంలో చైర్మన్ సాదవరెడ్డి,ఎం.పి.పి జయ,జడ్‌పిటిసి ప్రభాకర్,సర్పంచ్ ఐలయ్య, ఎంపిటిసి పద్మమల్లయ్య, వైస్‌చైర్మన్ శ్రీనివాస్, రాజేశ్వర్‌రావు పింగిలి రమేశ్, నర్సింగాపూర్ సర్పంచ్ జడల రమేశ్, ఎంపిటిసి సౌజన్యతిరుపతిరెడ్డి, వివిధ గ్రామాలనాయకులు కార్యకర్తలు సర్పంచ్‌లు ఎంపిటిసిలు రైతుల సమన్వ య కమిటీల సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పేదల కన్నీళ్లను తుడిచేది తెలంగాణ ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -