Home కరీంనగర్ సస్యశామలంగా కరీంనగర్

సస్యశామలంగా కరీంనగర్

knr2

ఉభయ గోదావరి జిల్లాలను తలపించేలా కరీంనగర్
భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్

కరీంనగర్‌రూరల్: 2018 ఆగస్టు మాసం కల్లా కరువు ఛాయల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సస్యశామలంగా మారబోతుందని భారీ నీటిపారుదల శాఖ మ ంత్రి తన్నీరు హరీష్‌రావు, ఆర్థిక,పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ మండల ంలోని బొమ్మకల్ గ్రామంలోని ఓ ప్రైవేట్ గార్డెన్‌లో బిజెపి, కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ మండలంనకు చెందిన 5 గురు సర్పంచులు, ఒక ఎంపిటిసి సుమారు 600 కార్యకర్తలతో కరీంనగర్ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ ఆధ్వర్యంలోభారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ మండలం కొద్దో గొప్పో బిజెపి కాంగ్రెస్ మిగిలి ఉండేదని నేటితో మం డలం గులాబీ దండుగా మరిందన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు చూసే పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని అ న్నారు. తెలంగాణ కరువు ప్రాంతంగా ఉండి నేడు ముఖ్యమ ంత్రి కెసిఆర్, మంత్రుల సారథ్యంలో సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించి సస్యశామలం చేయబోతు న్నామన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల,ప్రాణహిత తదితర ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సాగు ఢోకా లేకుండా ధాన్య భాండాగారంగా రూపు దిద్దు కోబోతుందన్నారు. టిఆర్‌ఎస్ ఉద్యమ ఏ జెండాతో ముందుకు వచ్చి నేడు అభివృద్ధి నినాదంతో ముందుకు సా గుతూ తెలంగాణను బంగారు తెలంగాణగా సాధించేందుకు కెసిఆర్ సారథ్యంలో ముందుకు వెళ్లుతున్నామన్నారు. గోదావరి నది తలమీదనే ఉన్న కరీంనగర్ కరువు ప్రాంతంగా ఉ ండటానికి కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. గోదావరి నది ప్రవాహా ప్రాంతమైన నిజామాబాద్,ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, జిల్లాలున్న నీరు ఆ జిల్లాలకు చేరక కరువు అల్లడియాన్నారు. కాని గోదావరి నది నీరు అంతా ఉభయ గోదావరికి చేరి ఆ రెండు జిల్లాలు సస్యశామలం చేసింది కాంగ్రెస్ నాయకులే అన్నారు. కరీంనగర్ జిల్లా ఉభయ గోదావరి జిల్లాలగా సాగు నీరుతో సస్యశామలం కాబోతుందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల మారదిగా కరీంనగర్ సాగు, త్రాగు నీటితో కళకళలాడబోతుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో చుక్క నీరు వర్షం పడకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛతీష్‌గడ్ రాష్ట్రాలలో వర్షాలు కురిసిన తెలంగాణ ప్రాంతంలో సాగు నీరు ప్రాజెక్టులు నిండి సస్యశామలంగా మారుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో ఆదర్శంగా నిలవనుందన్నారు. మీ కష్టాలు తీర్చడం కోసం టిఆర్‌ఎస్ పార్టీ ఉందని, ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో మీ కష్టాలు తీర్చడం కోసం పనిచేస్తున్నామన్నారు. తెలంగాణలో కేవలం ఉద్యమ పార్టీయైనా టిఆర్‌ఎస్ పార్టీయే ఉంటుందని జాతీయ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ అభివృద్ధి చూసే నేడు ఇతర పార్టీల నుండి టిఆర్‌ఎస్‌లోకి వస్తున్నారన్నారు. బంగారు తెలంగాణకు కెసిఆర్ సారథ్యంలో ముందుకు వెళ్తుతున్నామని, ప్రజల ఆశ్వీరదంతోనే అది సాధ్యమని, మీ అండదండాలు మాకు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మైనార్టీ కార్పోరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మేయర్ రవీందర్ సింగ్, ఎంపిపి వాసాల రమేష్, జడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎఎంసి వైస్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, 5 గ్రామల సర్పంచులు, ఎంపిటీసీలు, 600 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.