*నత్తనడకన సాగుతున్న రోడ్ల విస్తరణ పనులు
*అధికారుల పర్యవేక్షణ లోపం
*ప్రయాణికులకు తొలగని ఇబ్బందులు
మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి
నిత్యం రద్దీగా వుండే రోడ్లు అతుకులు, గతుకులుగా మారడంతో రెండేళ్ళ క్రితమే ప్రభుత్వం రహదారుల అభివృద్దికి పూనుకుంది. నిర్ధేశించిన గడువులోపు పూర్తి చేయాల్సిన అభి వృద్ది పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే వున్నాయి. ఉమ్మడి జిల్లాలో రహదారు లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రెండు మూ డేళ్ల క్రితం చేపట్టిన రోడ్డు విస్తరణ, హైలెవల్ బ్రిడ్జీల నిర్మాణం, వంతెనల పనులు పూర్తికాక పోవడంతో రాకపోకలకు తీవ్ర అం తరాయం ఏర్పడు తోంది. కేంద్ర రహదారుల నిధి, నాబార్డు ప్ర ణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద జిల్లాలో 1500 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి కోసం 1200 కోట్ల రూపాయల వ్యయం తో పనులు మంజూ రైనప్పటికి రెండేళ్లు గడుస్తున్నా పనులు పూ ర్తి చేయకపోడంపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తు న్నారు. ఆర్‌అండ్‌బి నల్లగొండ డివిజన్ ఆధీనంలో 1699.30 కి.మి రహదా రులు ఉన్నాయి. వీటిలో 1571.16 కి.మీ జిల్లా ప్రధాన రహదారు లు న్నాయి. సూర్యాపేట జిల్లా పరిధి లో 945.713 కి.మీ రహదారు లుండగా, జిల్లా ప్రధాన రహ దారులు 520.233 కి.మీ, గ్రామీణ ప్రాంత
రహదారులు 347.28 కి.మీటర్లు ఉన్నాయి. యదాద్రి భువనగిరి జిల్లా కింద 791.333 కి.మీ నిడివిగల రహదారులుండగా వాటి లో 455.39 కి.మీ జిల్లా రహదారులు కాగా, జిల్లా పరిషత్ నుంచి తీసుకున్నవి 293.92 కి.మీ రహదారులు. రహ దారుల అభివృద్ధిలో భాగంగా జిల్లాలో రెండు వరసల రహ దారి సౌకర్యం లేనటువంటి 17 మండలాలను జిల్లా కేంద్రం తో అనుసంధానం చేసేందుకు 209 కి.మీ రహదారులను రెం డు వరసల రహదారులుగా అభివృద్ది చేసేందుకు 225 కోట్ల రూపాయల పనులను మంజూరు చేశారు. 300 కోట్లతో మరో 24 జిల్లా రహదారులను రెండు లైన్ల రోడ్డుగా విస్తరించేందుకు పనులు మంజూరయ్యాయి. ఈ అభివృద్ది పనులకు టెండర్లు పిలిచి అగ్రిమెంట్‌లు చేసి సదరు కాంట్రాక్టర్లకు పనిని పూర్తి చేయాల్సిన గడువును నిర్ధేశించినప్పటికి గడువుముగిసి రెం డేళ్లు దాటుతున్నా నిర్మాణ పనులలో అతీగతి లేకుండా పో యింది. రూ.18 కోట్లతో చేపట్టిన నకిరేకల్-వజీరాబాద్ 16 కి.మీ రోడ్డు వెడల్పు. పటిష్టపరిచే పనులు 2016లో పూర్తి కావల్సివుండగా సబ్‌గ్రేడ్ వరకు మాత్రమే పూర్తియింది. రూ.10 కోట్లతో చేపట్టిన కనగల్-చింతగూడెం 10 కి,మీ రోడ్డు విస్తరణ పను లు 2016 నవంబర్ నాటికి పూర్తి చేయాల్సివుండగా 8 కి.మీ మేర సబ్‌గ్రేడ్ పనులు మాత్రమే జరిగాయి. రూ.35 కోట్లతో 34 కి.మీ రోడ్డు పనులను 2016 ఎఫ్రిల్ లో ప్రారంభించి 18 ఏఫ్రిల్ నాటికి పూర్తి చేయాల్సివుండగా రెండేళ్ళలో కేవలం 18 కి.మీ బిటి పనులు మాత్రమే జరిగాయి. రూ.68 కోట్లతో చేపట్టిన దేవరకొండ ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌజ్ భవననిర్మాణం 2016 మే లో పూర్తి చేయాల్సివుండగా ప్రస్తుతం ప్లాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. హూజూర్‌నగర్-మట్టపల్లి రోడ్డులో కృష్ణా నదిపై రూ.36 కోట్లతో నిర్మిస్తున వంతెన పనులు16 జూన్‌లో పూర్తిచేయాల్సివుండగా పనులు కొనసాగుతూనే వున్నాయి. 2018 మే ఇ.ఓ.టి మంజూరు కొరకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది నాటికి పూర్తి చేయాల్సిన పనులలో సూర్యాపేట డివిజన్‌లో రూ. 54 కోట్లతో చేపట్టిన 6 రోడ్డు విస్తరణ పనులు, తుంగతుర్తి రూ. 25 కోట్లతో మూడు పనులు, రూ. 53 కోట్లతో 7 పనులు నత్తనడకన సాగుతున్నాయి. వందల కోట్ల రూపాయలతో చేపట్టిన పనులలో తీవ్ర జాప్యం జరుగుతున్నా క్షేత స్థాయి అధికారు లు ఎటువంటి చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.
గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో
నేటి యువకులు వివకేకానందుడిని ఆదర్శంగా తీసుకోని ముందకు సాగాలని జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన బోధనలు ప్రపంచానికి ఆదర్శమని, ప్రతి ఒక్క రు ఆచరించి వారి యొక్క లక్ష్యాలను సాధించుకోవాలని చె ప్పారు.ఈ కార్యక్రమంలో నాయకులు మొరిశెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్లు పిండి వనజ, తాహేర్ పాష, తూడి నర్సింహారావు, గండూరి రమేష్, రామకృష్ణ, గ్రంధాలయ డైరెక్టర్ కళ్లేపల్లి మహేశ్వరి, రియాజ్, శారదాదేవి, ఇరిగి కోటేశ్వరి, గునగంటి రాములు, పోలెబోయిన నర్సయ్యయాదవ్ పాల్గొన్నారు.