Home కుమ్రం భీం ఆసిఫాబాద్ గిరిజనులు విద్యపై దృష్టిపెట్టాలి

గిరిజనులు విద్యపై దృష్టిపెట్టాలి

sit2

మనతెలంగాణ / బెజ్జూర్ : గిరిజన యువకులు, విద్యార్థులు విద్యపై దృష్టిసారించి ఉద్యోగాలు సాధించాలని ఎస్‌ఐ రామారావు అన్నారు. బుధవారం మండలంలోని సోమిని, మొగవెల్లి గ్రామాల్లో పర్యటించారు. అనంతరం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలకు అపరిచితులు వస్తే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామప్రజలను కోరారు. గిరిజనులు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, రాబోయే ప్రభుత్వ ఉద్యోగాలకు యువకులు సన్నదం కావాలన్నారు. ప్రాణహిత సమీప ప్రాంతాలు కావడంతో మహారాష్ట్ర నుంచి వచ్చిపోయే వ్యక్తుల కదలికలు గమనించి పోలీసులు సమాచారం అందించాలన్నారు. మూఢనమ్మకాలను వీడనడాలన్నారు. మారుమూల ప్రాంతాల గ్రామాల ప్రజలు, రైతులు నకిలీ విత్తనాలు సాగుచేయవద్దని, నకిలీ విత్తనాలు సాగుచేయడంతో భూసారం తగ్గుతుందని, పంట దిగుబడి తక్కువగా వస్తుందన్నారు. గ్రామంలో ఏలాంటి సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందకు కృషి చేస్తాన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచు కోడిపే లక్ష్మిశంకర్, అంగన్‌వాడీ టీచర్ వినోద, గ్రామస్తులు సీతారాం, మాదవరావు, ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.