Home ఆదిలాబాద్ గిరిజనులు విద్యాపరంగా ఎదగాలి

గిరిజనులు విద్యాపరంగా ఎదగాలి

tribals should grow up academically:

జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ 

మన తెలంగాణ/ఆదిలాబాద్: ఆదివాసీల గ్రామంలో ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ప్రారంభించడం అభినందనీయమని ఆదివాసీల పిల్లలు మంచి విద్యాభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అకాంక్షించారు. గురువారం ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని  న్యూ చింఘాట్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీలు అయా యక ప్రజలనీ, వారు విద్యను అభ్యసించి ఉన్నతమైన పదవులు ఉద్యోగాలను పోందాలని అకాంక్షించారు. పంటసాగుకు వడ్డీలకు రుణాలు తీసు కోని భూములు అమ్ముకోవడం, తద్వారా అర్థికంగా వెనుకబడటం జరుగుచున్నదని, దివ్య నభ్యసించడం వలన ఉపాధి అవకాశాలు పొందవచ్చని అన్నారు. ఆదివాసీల భూములో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటసాగుకు చించుఘాట గ్రామాన్ని ఎంపిక చేశామని, డ్రిప్ ద్వారా పంటసాగు చేసి ఆదర్శ గ్రామంగా ఎదగాలని అన్నారు. అనంతరం ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి పదవ తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ, పదవ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని, పంచాయతీ కార్యదర్శి వీఆర్‌వో తదితర సోస్టుల భార్తీని ప్రభుత్వం నోటీపికేషన్‌లు జారీ చేసిందని, కనీపం పదవ తరగతి పాసైతీ ఉద్యోగం పోందవచ్చని అన్నారు. ఎటిడివో సౌజన్య మాట్లాడుతూ ఆంగ్ల మాద్యమంలో 70 మంది విద్యార్థులకు నమోదయ్యారని, గ్రామస్తుల సహకారం, సమీష్టి ద్వారా పిల్లలకు యూనఫాం డిజైన్ చేసుకున్నారన్నారు. కాత్లే మారుతి మాట్లాడుతూ వంటషేడ్, అదనపు తరగతి గదులు, అయాను నియమించుకోనుటకు నిధులు మంజూరుకు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో జయశీల, జిల్లా పట్టు, ఉద్యాన శాఖాధికారి కే.వెంకటేశ్వర్, పీసా కో అర్డినేటర్ సెడ్మకి బొజ్జు, తహసిల్దార్ మధుకర్, ఎంపిడివో రవీందర్, పాఠశాల ఉపాధ్యాయులు మల్కు, ప్రభు, గ్రామ పటేల్ కుమ్ర రాజు, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.