*ప్రతి నారుమడికి నీరు
*నిరంతరం పర్యవేక్షణ
*పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన
మనతెలంగాణ/ధర్మారం: చివరి ఆయకట్టు వరకు నీరందేవిధంగా శివారులోని డి.83, డి83బి కాల్వల ను కలెక్టర్ శ్రీదేవసేన ఆదివారం సాయంత్రం ఆ కస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కా ల్వలోని నీటి సామర్ధాన్ని పరిశీలించడంతో పాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం కలెక్టర్ ఎస్‌ఆర్ ఎస్‌పి,రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయంగా నీరం దించాలని,గుంట నారుమడి ఎండకుండా జాగ్రత్త లు చేపట్టాలని సూచించారు. అధికారులు, సిబ్బంది నిరంతరం సమన్వయంతో పని చేయాలని అన్నారు. తాను ప్రతిరోజు పర్య వేక్షణ చేస్తానని వాగులు, కుంటలు నిండటం ముఖ్యం కాదని ప్రతి పొలానికి నీరందించాలని అన్నారు. ధర్మారం తహసీల్దార్ సిఈలకు పూర్తి సల హాలు అందిం చారు. అవస రమైతే ఒక రోజు నీటి పొడగింపు ఉ ంటుందని ఏదై నా మంత్రి అ దే శానుసారం నడవాలని దేసేన అన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కె.వై.ప్రసాద్, డిఇ మ ధుసూధన్‌రెడ్డి, విఆర్‌ఒ ఉన్నారు.