Home ఎడిటోరియల్ తిండి‘పోటుగాళ్ళు!’

తిండి‘పోటుగాళ్ళు!’

Beefఎవరు ఏమితింటారన్నది వారి ఇష్టం! ఆహార పు అలవాట్లను కూడా శాసించడం అంటే – అది ‘ఆధిపత్య’ ఆహంకారానికి పరాకాష్ఠనీ ఇంటి కొచ్చిన వారికి నువ్వు వండిపెట్టే భోజనం, నీ ఇష్టప్రకారం వుంటే తప్పేం లేదు. అతిథులకు వారికి ఇష్టమయ్యే పదార్థాలే వండివడ్డిస్తావా లేదా అన్నది నీ ఇష్టం! వారు నీ ఇంట ఆ భోజనం తృప్తిగా, ఆప్యాయంగా తింటారా లేదా అన్నది వారి ఇష్టం! కానీ ఎదుటి వారింట్లో – వారు ఏం వండుకు తింటారో అది వారి ఇష్టం! వారు ఫలానాదే తినాలని శాసించడానికి నువ్వెవరు?
శాకాహారులు, మాంసాహారులు అని ఆహారపు అలవాట్ల ప్రకారం మనుషులు రెండుగా వర్గీకరింప బడినా, ఒకే ఆహారపు అలవాటుకు కట్టుబడివుండక, శాకాహారులుగా వేరుబడ్డ కులాలవారూ, వర్గాల వారు మాంసం భుజించిన ఘటనలూ, అలాగే మాంసాహారులే అయినా – అనునిత్యం మాంసం తోనే ముద్దతినడం కాక, శాకాహార తిండి తినే విస్తృత సందర్భాలు వుంటూనే ఉంటాయి! కొన్ని పదార్థాలు కొందరికి శాకాహారంగానే భావన కూడాను. గుడ్లు, చేపలు వెజిటేరియన్‌గా భావించే ప్రాంతాలూ వున్నాయి.
దేశంలో అనేకచోట్ల ఇటీవలికాలంలో పండు గలు ఉత్సవాల కొన్ని ప్రత్యేక సందర్భాలలో – మాంసాన్ని నిషేధించటం జరుగుతోంది. ఒక విధంగా ఇది నైతిక ఆధిపత్య సంస్కృతియే! గోపరి రక్షణ చట్టం ప్రకారం గోవధకు పాల్పడితే ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఏడేళ్ళ జైలుశిక్ష ఉంటోంది. కానీ గోమాంసం కలిగివున్నారనో, తిన్నారనో – సాకుతో ఒకరిని హత్యచేయడం అత్యంత అమానుష మైన చర్య! దాద్రీ ఘటన ఇందుకు పరాకాష్ఠ! బిసాదా గ్రామంలో మహమ్మద్ అఖ్‌లాఖ్ అనే యాభై ఏళ్ళ వృద్ధుడిని – ఆవుమాంసం తిన్నాడని హత్య చేయడం, అత్యం త హేయం! అత ను గోవధకు పాల్పడ్డాడని అన్న ట్లయితే, చట్టం ప్రకారం అరెస్టు చేసి శిక్షించాలి కానీ, ఉన్మాదంతో ఆ వృద్ధుడినే హత్య చేయడం ఏమిటి? పైగా అలా హత్య చేసిన వారిని ప్రభుత్వ యంత్రాంగం ఉపేక్షించ డమేమిటో అర్థం కాని వ్యవహారం!
మోదీ అధికారంలోకి వచ్చాక – హిందూ మతో న్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయనడానికి ఇది తాజా ఉదాహరణగానే కానవస్తోంది!మాంసాహారం భుజించినందుకు ప్రజలను హత్యచేసిన చరిత్ర నిజానికి ప్రపంచంలో ఎక్కడాలేదు. రాముడు, కృష్ణుడు అని పూజించే దైవాలు కూడా – వారి కుల ధర్మం ప్రకారం మాంసభక్షణ చేసినవారే! శాఖా హారులనే బ్రాహ్మణకులాలవారు – ఆ దేవుళ్ళను పూజించడం లేదా? నిజానికి బ్రాహ్మణులనే వారి లోనూ మాంసభక్షకులున్నారు. తినేతిండి అన్నదాని మీద, ఆంక్షలు పెట్టేదెవరు? దానికెవరికీ అధికారం లేదు. శరీర రోగ్యానికి, ఆయుష్షుకీ, రుచికీ ఏ ఆహారం మంచిదన్నది ఎవరికి వారు నిర్ణయించు కోవాల్సిందే! ‘అన్న విజ్ఞాన శాస్త్రం’లో చెప్పబడే విషయాలేవయినా – అన్వయించుకు పాటించడం అనేది, ఎవరిష్టం వారిదే!
మహారాష్ట్ర, రాజస్థాన్, చత్తీస్‌గడ్ వంటి రాష్ట్రాల లో బిజెపి పాలన ఉంది. జైనులపండుగ సందర్భంగా మాంసం అమ్మకాలను నిషేధిస్తూ, ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి! జమ్మూ-కాశ్మీర్‌లో ముస్లింలు అధికం అన్న విషయం అందరికీ తెలి సిం దే! అయితే -ఆ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. దాని పై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఇదే భిత్తికగా ఆహారపు అలవాట్లపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ ఊపందు కుంటోంది.
ఇప్పుడు దసరారోజులు ఇక ప్రవేశిస్తున్నాయి. రాబోయే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశ వ్యాప్తం గా మాంసం అమ్మకాలను తొమ్మిది రోజుల పాటు నిలిపివేయాలని – కేంద్ర సాంస్కృతిక అమా త్యులు మహేష్‌శర్మ సూచన కూడా వివాదాస్పద మవుతోంది. దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, క్రిస్టి యన్లు తదితరులలో గొడ్డు మాంసం తినడం మామూలే! ఆ మాటకొస్తే గొడ్డుమాంసం ఎగుమతి చేయడంలో అనేకదేశాలతో పోల్చినా భారత్ అగ్రస్థానంలోనే ఉంది. పశుమాంసం ఎగుమతిని ప్రభుత్వం నిషేధించగలుగుతోందా?
మాంసాహారులే హింసాత్మక చర్యలకు పూను కుంటారనీ, మనిషిలో పశుత్వాన్నీ, దానవత్వాన్నీ, రెచ్చగొట్టే శక్తి మాంసాహారానికి వుందనీ అందువల్ల నేరప్రవృత్తికీ, హింసాప్రవృత్తికీ వారే అధికంగా పాల్పడతారనీ అనేవారున్నారు. కానీ అందుకు ఋజువులు ఏమున్నాయి? గోమాంసం తిన్నాడని, విద్వేషంతో వృద్ధుడిని సంహరించింది ఒక శాకా హారియే అయినప్పుడు, నైజానికీ, ఆహారపు అల వాటుకీ ముడిపెట్టడం కూడా తప్పే అవుతుంది. చదువు, సంస్కారం పెరిగిన వాతావరణం, వ్యక్తి మాన సిక నైజం- ఇవన్నీ ప్రవర్తనకు కారణం అవు తాయి. తిన్న తిండి ప్రభావం శారీరక, మానసిక స్థితులపై వుండడం వాస్తవమే కావచ్చు. కానీ అంత మాత్రాన ఈ ఆహారమే సరియైనది, ఇది కాదు అని నిర్థారించడం, ఫలానాదే తినాలని ఒత్తిడులు తేవడం ఎవరు ఎవరిపట్ల కనబరిచినా అది గర్హనీయం! నిశితంగా ఖండించవలసిందే! కులం, మతం వంటివేకాక – ‘ఆహారం’ కూడా రాజకీయం అయి పోయి, సామాజిక వాతావరణాన్ని స్వార్థ ప్రయోజ నాలతో కలుషితంగానూ, విషతుల్యంగానూ మార్చ డం క్షమించరాని తప్పు! ఆ పని ఎవరు చేసినా క్షమార్హం కాదు.
“తిండి కలిగితె కండకలదోయ్!
కండకలవాడేను మనిషోయ్‌” – అని గురజాడ అన్నాడంటే జాతి ‘ఈసురోమంటూ’ వుండకూడదనే గానీ, కండకావరంతో మెలిగే విద్వేష ఆధిపత్య అహంకృత సంస్కృతి గురించి కాదు. ఆహార నియంతృత్వం గురించి కాదు.