Tuesday, March 21, 2023

చెట్టును ఢీకొని యువకుడి మృతి

- Advertisement -

body

మనతెలంగాణ/పెగడపల్లి : మండలంలోని ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు గురువారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు. గ్రామానికి చెందిన ఎట్టేం రమేష్ (18) తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ రాజారాంపల్లి గ్రామ శివారులోని చెట్టును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం ఉదయం అటువైపు వెళ్ళిన ప్రయాణీకులు శవం పడి ఉన్న విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో ఎస్‌ఐ జీవన్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి తల్లి మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles