మనతెలంగాణ/దుబ్బాకః దుబ్బాక మండలం పోతారెడ్డి పేట గ్రామానికి చెందిన మల్కనగిరి శ్రీకాంత్(17) చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు గ్రామస్దులు తెలిపారు. కుటుంభీకుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పోతారెడ్డిపేట గ్రామానికి చెందిన మల్కనగిరి సత్తయ్య, ప్రమీలకు ఇద్దరు కుమారులు, ఒక్క కుమార్తె ఉన్నారు. కాగా చిన్న కుమారుడైన శ్రీకాంత్ రామాయంపేటలో ఇంటర్ చదువుతు హైదరాబాద్‌కు ఉపాధి నిమిత్తం వెళ్ళినట్లు వారు పేర్కోన్నారు. కూడవెళ్లి జాతర నిమిత్తం గ్రామానికి వచ్చిన శ్రీకాంత్ తిరిగి హైదరాబాద్ వెళ్తానని తండ్రిని డబ్బులు అడగగా తర్వాత ఇస్తాలేనని చెప్పడంతో మనస్థాపం చెందిన శ్రీకాంత్ గ్రామ సమీపంలో ఉన్న పొలం వద్ద ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంభీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరళించారు. భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఉరివేసుకుని యువకుని మృతి
- Advertisement -
- Advertisement -