Friday, April 26, 2024

ప్రారంభమైన థియేటర్లు..

- Advertisement -
- Advertisement -

Theaters Reopen with Full Capacity in Telangana

హైదరాబాద్: సినీ అభిమానులు గత రెండు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమో థియేటర్లు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం అయ్యాయి. కరోనా సెకండ్‌వేవ్ విజృంభించడంతో నగరంలోని సినిమా థియేటర్లు మూతపడ్డ సంగతి తెలిసిందే. 100 శాతం ఆక్యుపెన్సీతో తిరిగి ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం ఉత్వర్లు మేరకు నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. కొవిడ్ నిబంధనల్లో భాగంగా నిర్వాహకులు ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం వందశాతం ఆక్యుపెన్సీతో సినిమాలను ప్రారంభించుకోవచ్చని చెప్పడంతో థియేటర్లలో తిమ్మరసు, ఇష్ తదితర చిన్ని సినిమాలను ప్రదర్శించారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్ల వద్ద రద్దీగా సందడిని వాతావరణం నెలకొంది. థియేటర్ల ప్రారంభమై మొదటి రోజే కావడంతో ప్రేక్షకులు పల్చగా కనిపించారు.

అయితే శని, ఆదివారాలు వారాంపు రోజులు కావడంతో ప్రేక్షకులు సంఖ్య పెరుగుతుందని నిర్వాహకులు అభిప్రాయం వ్యక్తం అవుతోంది. త్వరలో పెద్ద హీరోల సినిమాల విడుదల తేదీని కూడా ప్రకటించడంతో సినిమాలకు వచ్చే ప్రేక్షకులు సంఖ్య కూడా పెరుగుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కూడా వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తుండటంతో ఎన్ని రోజులు థియేటర్ల నడుస్తాయో చెప్పలేమంటున్నారు.

Theaters Reopen with Full Capacity in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News