Home తాజా వార్తలు సినీ ప్రియుల నిరీక్షణకు తెర

సినీ ప్రియుల నిరీక్షణకు తెర

Theatres to open in telangana from july 30

 

నేటి నుంచి థియేటర్లు ప్రారంభం 100 శాతం సీట్లతో నడపనున్న నిర్వాహకులు
30 నుంచి మల్టీఫ్లెక్సుల్లో సినిమాలు థియేటర్లలో పనిచేయనున్న 21వేల మందికి జీవనోపాధి
పార్కింగ్ ఫీజులు వసూలు చేయనున్న యాజమాన్యాలు

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో కరోనా నేపథ్యంలో మూతపడ్డ సినిమా థియేటర్లు నేటి నుంచి జ నంతో సందడి చేయనున్నాయి. సినిమా నటుల అభిమానులతో కోలాహలంగా మారునున్నాయి. సినీ ప్రియుల నిరీక్షణకు తెరపడి వెండి తెరపై చిత్రం నడవనుంది. కరోనా వైరస్‌తో మొదటి లాక్‌డౌన్‌తో దాదాపు 09 నెలల పాటు మూడపడ్డ థియేటర్లు డిసెంబర్ నుంచి రెండు నెలల పాటు 50శాతం సీట్ల నడపగా, ఊ హించని విధంగా మళ్లీ సెకండ్ వేవ్ విజృంభణ చేయడంతో రెండోసారి తాళం వేశారు. దీంతో నగరంలో థి యేటర్లపై ఆధారపడ్డ లక్షలాదిమంది వర్కర్లు రోడ్డు ప డ్డారు. నేటి థియేటర్లు తెరిచి 100శాతం సీట్లతో నడిపే విధంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఉద్యోగులం తా ఉపాధి లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే వైద్యశాఖ కొవిడ్ నిబంధనలు పాటించకుంటే థర్డ్‌వేవ్ వస్తుందని హెచ్చరించడంతో నిర్లక్ష్యం చేయకుండా మాస్కులు ధరించుట, శానిటైజర్ తప్పకుండా అందుబాటులో ఉండాలని సూచిండచంతో యాజమానులు తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గ్రేటర్ మూ డు జిల్లాల పరిధిలో 600 థియేటర్లు, మల్టీప్లెక్స్‌లున్నా యి. ఒక మల్టీపెక్స్‌లో 150మంది పనిచేస్తుండగా వాటిలో 3750 ఉపాధి లభిస్తుండగా, వీటిలో సగం మంది మహిళలే ఉన్నారు. 575 థియేటర్లలో ఒకదాని లో 30మంది చొప్పన 17,250 కార్మికులు విధులు ని ర్వాహిస్తున్నారు. అన్నింటిలో కలిపి సుమారు 21వేలు మంది జీవనోపాధి పొందుతున్నారు. వీరంతా కరోనా కాలంలో కష్టాలు ఎదుర్కొన్నారు.

నేటి థియేటర్లు ప్రారంభంకావడంతో వారి జీవితాల్లో కొత్త వెలుగులు నిండినట్లు ఉందని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. నేడు 15 సింగిల్ స్క్రీన్ థియేటర్లు, 30వ తేదీ న నుంచి మల్టీప్లెక్సులు, ఇతర సినిమా హాళ్లు ప్రారంభంకానున్నాయి. మొదటి రోజు నేరగాడు అనే చిత్రా న్ని ప్రదర్శించనున్నారు. ఈ నెల 30న నుంచి పెద్ద సినిమాలు విడుదలైతుండటంతో అదే రోజు మల్లీప్లెక్స్‌లు, ఇతర థియేటర్లు ప్రారంభమైతాయి. కాగా థియేటర్లలో పార్కింగ్ చార్జీలు వసూలు చేయనున్నారు. ప్రభుత్వం ఇటీవల అనుమతిస్తూ జీవో జారీ చేసింది. మల్టీప్లెక్స్, మాల్స్, వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ పీజులు వ సూలు చేయరాదని, అక్కడ పాత పద్దతినే కొనసాగించాలని ప్రభుత్వం పేర్కొంది.

కరోనాకాలంలో కార్మికులు వేతనాలు చెల్లించాలి : కార్మిక సంఘాలు
మొదటి లాక్‌డౌన్‌లో మార్చి 2020 నుంచి నవంబర్ వరకు థియేటర్ల మూతపడటంతో వాటిలో పనిచేసే కా ర్మికుల జీవితాలు అంధకారంలో పడ్డారు. కొంతమంది యాజమానాలు 30శాతం వేతనాలు అందజేసి చేతులు దులుపుకుని, తరువాత వారి గురించి పట్టించుకోలేదని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మూతపడి రోజులకు సంబంధించిన వేతనం పూర్తిగా ఇవ్వాల ని డిమాండ్ చేస్తున్నారు. థియేటర్లు అన్ని ఒకేసారి తెరవాలని, ఓటీటిలో కాకుండా థియేటర్లలో సినిమాలు వి డుదల చేయాలని, దీంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారని పేర్కొన్నారు. యాజమానులు కొవిడ్ నిబంధనలు పా టించి వైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Theatres to open in telangana from july 30