Home తాజా వార్తలు ఆలయంలో చోరీ

ఆలయంలో చోరీ

Theft at Templeమహబూబ్‌నగర్ : కురుమూర్తి స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. శనివారం ఉదయం ఈ చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు రెండు హుండీలను ఎత్తుకెళ్లారు. ఆలయానికి సమీపంలో ఉన్న లోయలో రెండు హుండీలను పోలీసులు గుర్తించారు. ఒక హుండీని పగులగొట్టి నగదును అపహరించారు. మరో హుండీ పగలకపోవడంతో అక్కడే వదిలేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Theft at Temple in Mahabubnagar