హైదరాబాద్ : బోయిన్‌పల్లిలోని మల్లికార్జుననగర్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 12 తులాల బంగారం, అర కిలో వెండి, రూ. లక్ష నగదును ఎత్తుకెళ్లారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.