రంగారెడ్డి : అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడలో చోరీ జరిగింది. కంఠమహేశ్వర, సురమాంబ ఆలయంలో గురువారం అర్ధరాత్రి దుండగలు చోరీచేశారు. ఉత్సవ విగ్రహాలతో పాటు ఆలయ గంటలను, హుండీని ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం ఈ చోరీ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.