Home తాజా వార్తలు జగిత్యాలలో మొబైల్ షాప్‌ల్లో చోరీ

జగిత్యాలలో మొబైల్ షాప్‌ల్లో చోరీ

 

 

జగిత్యాల: జిల్లా కేంద్రంలోని అంగడిబజారులో మంగళవారం అర్ధరాత్రి రెండు మొబైల్ షాప్‌లల్లో చోరీ జరిగింది. స్థానికంగా ఉన్న భవానీ సెల్, లాట్ సెట్ పాయింట్‌లో చోరీకి పాల్పడిన దొంగలు సెల్ పాయింట్‌లోని విలువైన సెల్‌ఫోన్‌లు, ఇతర వస్తువులను అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షాపుల్లోని సిసి కెమెరాల ఆధారంగా దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దోచుకెళ్లిన సొత్తు దాదాపు రూ.50లక్షలు విలువ ఉంటాయని బాధితులు తెలిపారు.

Theft in Two Mobile Shops in Jagtial