Friday, April 26, 2024

ప్రధాని రుణం తీసుకుని ప్రేమికులతో భార్యలు పరార్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రజలు ఇల్లు కట్టుకోడానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రుణాలు మంజూరవుతున్నాయి. ఆర్థికంగా బలహీనులైన వారికి, స్వల్పాదాయ వర్గాల వారికి రూ.3 లక్షల నుంచి 18 లక్షల వరకు గ్రూపుల వారీగా రుణాలు కేంద్రం మంజూరు చేస్తోంది. వడ్డీ రాయితీ కూడా కల్పిస్తున్నారు. అయితే ఇంటి యజమాని మహిళ ఉండాలన్న నిబంధన పెట్టారు. దీంతో చాలా మంది నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలో ఇదే పథకం కింద 40 మందికి ఇళ్ల రుణాలు మంజూరయ్యాయి. అందులో మొదటి విడతగా ఒక్కో లబ్ధిదారు ఖాతాలో రూ. 50 వేలు వంతున జమ చేశారు. ఇది కొందరు భర్తల పాలిట శాపంగా మారింది. రుణాలు పొందిన 40 మందిలో నలుగురి భార్యలు అడ్రసు లేకుండా పోయారు. వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన రూ. 50 వేలు కూడా మాయమయ్యాయి.

దీంతో వారి కోసం వారి భర్తలు ఆరా తీయగా, వారి భార్యలు తాము ప్రేమించిన వ్యక్తులతో పారి పోయినట్టు తేలింది. ఇలా పారిపోయిన వాళ్లలో బెల్హారా, బాంకీ, జైదాపూర్, సిద్ధౌర్ నగర పంచాయతీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రుణం తీసుకుని భార్యలు పరారీ కావడంతో భర్తలు లబోదిబో మంటున్నారు. మరో వైపు నిధులు మంజూరైనా ఇళ్లు మొదలు పెట్టకపోవడంతో రుణాలు రికవరీ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నెలనెలా ఈవిఎంలు సరిగా కట్టకపోతే నోటీసులు అందుకోవాల్సి వస్తుందని బ్యాంకు అధికారులు బెదిరిస్తున్నారు. బాధిత భర్తలు జిల్లా కేంద్రం లోని అధికారులను ఆశ్రయించారు. మొదటి విడత నిధులతో తమ భార్యలు పరారయ్యారని, మిగతా నిధులనైనా, వారి ఖాతాల్లో వేయకుండా నిలిపి వేయాలని మొర పెట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News