Home కామారెడ్డి ప్రభుత్వ భూములకు రక్షణ కరువు…

ప్రభుత్వ భూములకు రక్షణ కరువు…

 government land

 

* ప్రభుత్వ భూమిలో ఇటుక బట్టీలు
* అక్రమంగా మొరం తవ్వకాలు
* చోద్యం చూస్తున్న అధికారులు
* యథేచ్ఛగా సాగుతున్న
అక్రమ వ్యాపారం

కామారెడ్డి: ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చూసుకోవాల్సిన అధికారులే చేతివాటాలకు అలవాటుపడి తమకు పట్టనట్టుగా వ్యవహరించడంతో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వం నిరుపేదలకు భూపంపిణీ చేయగా ఆ భూమిని మరొక వ్యక్తి కొనుగోలు చేసి అలాంటి భూములలో అక్రమ దందాలు చేస్తున్న పట్టించుకోని వైనం నేడు జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ జరుగుతున్నా సదాశివనగర్ మండలం మల్లుపేట్ శివారులో అక్రమంగాఇటుక బట్టీలు, మొరంతవ్వకాలు జరుపుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం వట్ల పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

సదాశివనగర్ మండల కేంద్రానికి కొద్ది దూరంలోని ఒకప్పటి కల్వరాల్ ఆమ్లెట్ గ్రామంగా కొనసాగిన మల్లుపేట్ గ్రా మపంచాయతీ పరిధిలోని 44వ జాతీయ రహదారి పక్కనే 42సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి ఉంది.గతంలో మల్లుపేట్ గ్రా మానికి చెందిన నిరుపేదలకు ప్రభుత్వం భూ పంపిణీ చేయగా అట్టి భూమి నిరుపయోగం గా ఉన్న భూమిలో రాళ్ళు, బండలతో కూడుకొని సక్రమంగా లేకపోవడంతో అట్టి భూమి లో వ్యవసాయం చేయలేకపోయారు. వ్యవసాయానికి ఉపయోగంగా లేకపోవడంతో ప్రభుత్వపరంగా తీసుకున్న రైతు పేరనే ఉన్న గతం లో ప్రభుత్వ భూములను సైతం క్రమబద్దీకర ణ సమయంలో మల్లుపేట్ గ్రామానికి చెందిన రైతుపేర ఉన్న భూమిని గాంధారి మండలాని కి చెందిన వ్యక్తి కొనుగోలు చేసినట్లు తెలిసిం ది.కొనుగోలు చేసిన వ్యక్తి తన పేరున రెవెన్యూ కార్యాలయంలో రికార్డులలో నమోదు చేసుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది.

రహదారుల వెంబడి భూములకు డిమాండ్ పెరగడంతో అసైన్డ్ భూమి పై దృష్టిపడ్డ వ్యక్తి కొనుగోలు అనంతరం ఎలాంటి అనుమతులు లేకున్నా బాంబ్ బ్లాస్ట్ చేస్తూ రాళ్ళను పగులగొట్టి చదును చేశారు. అలాగే జాతీయ రహదారికి దగ్గరలోనే నిబంధనలకు విరుద్ధంగా బోరువేసి అక్కడే ఇటుక బట్టీలను పెట్టారు. ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా అక్రమ వ్యాపా రం చేస్తున్నా సంబంధిత అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరించడం తీరు పట్ల పలు అనుమానాలకు తావిస్తుందని గ్రామస్థులు తె లిపారు. రియల్ భూం రావడంతో భూముల కు రెక్కలు వచ్చాయి. దీంతో పట్టాభూమి అ యినా సరేఅసైన్ట్ భూమి అయినా సరే కొనుగోలు చేయడానికి రియల్టర్లు ముందుకు రావడంతో అసైన్డ్ భూములకు రక్షణ కరువైంది. రియల్టర్లు అందించే డబ్బులకు కక్కుర్తిపడి నే రుగా సాదాబైనామా పేరుతో రికార్డులను తారుమారు చేస్తున్నట్లు తెలిసింది.

నిరంతరం తిరిగే రోడ్డు వెంబడే అక్రమంగా ఇటుక బట్టీలు పెట్టినా చర్యలు తీసుకోకపోవడం పట్ల రెవెన్యూ అధికారుల వ్యవహారంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. అలాగే మండలంలోని కల్వరాల్ అటవీ ప్రాంతంతో పాటు సదాశివనగర్ అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల ను ండి అక్రమంగా మొరం తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు తమ కనుసైగలతో కమిషన్లుకు ఎగబడి ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు కమీషన్‌లు తీసుకొని రాత్రివేళల్లో జేసిబిల ద్వారా అక్రమంగా మొరాన్ని తరలిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటుక బట్టీల వ్యవహారంతో పా టు అక్రమ మొరం తరలింపులపై మన తెలంగాణ రెవెన్యూ అధికారుల వివరణకు ప్రయత్ని ంచినా సరియైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఈ విషయంలో మండలంతో పాటు జి ల్లాలో కొనసాగుతున్న అక్రమదందాల పై జి ల్లా కలెక్టర్ స్పందించి కొరడా ఝులిపించాలని ప్రజలు కోరుతున్నారు.

There is no government land protection