Home తాజా వార్తలు 26న నిరసనకు అనుమతి లేదు : ఎపి డిజిపి

26న నిరసనకు అనుమతి లేదు : ఎపి డిజిపి

N-SambaShiva-Raoహైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ యువత ఈ నెల 26న విశాఖపట్నం ఆర్.కె.బీచ్‌లో నిరసన చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిరసనకు పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు మద్దతు తెలిపారు. ఈ విషయంపై అంధ్రప్రదేశ్ డిజిపి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. 26న నిరసన ప్రదర్శనకు ఎటువంటి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. సోషల్‌మీడియాలో ట్వీట్లు చూసి యువత స్పందించవద్దని ఆయన పేర్కొన్నారు. ఇప్పడు అనుమతి కోసం వచ్చిన ఇప్పటికిప్పుడు బందోబస్తు ఏర్పాటు చేయడం కష్టమని తెలిపారు. ఇటువంటి ప్రదర్శనల్లో అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉందని ఆయన అన్నారు.