- Advertisement -
రాంచీ : ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఝార్ఖండ్‌లోని రాంచీలో వామపక్ష తీవ్రవాదంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాజ్‌నాథ్ మాట్లాడారు. వామపక్ష తీవ్రవాద వర్గాలు హింసను విడనాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో నోట్లరద్దు నిర్ణయం వామపక్ష తీవ్రవాదంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని అభిప్రాయపడ్డారు. సుస్థిరమైన కృషితో రానున్న కొద్దికాలంలో ఈ తీవ్రవాదం సమస్యను పరిష్కరించ వచ్చన్నారు. భయంకరమైన సైబర్ ఉగ్రవాదం, హ్యాకింగ్ సమస్యలపైనా దృష్టిసారించాల్సి ఉందన్నారు. వీటిని ధీటుగా అడ్డుకొనే దిశగా బలోపేతం కావాలని సెంట్రల్ ఇండస్ట్రియల్ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్)ను అదేశించారు.
- Advertisement -