Home తాజా వార్తలు నీటి సంరక్షణపై దృష్టి సారించండి

నీటి సంరక్షణపై దృష్టి సారించండి

water conservation

 

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాలీ చక్రవర్తి

వనపర్తి  : జలశక్తి అభియాన్ కింద నీటి సంరక్షణ కార్యక్రమాలతో పాటు తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాలీ చక్రవర్తి అన్నారు. వనపర్తి జిల్లాలో అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ కార్యక్రమం పరిశీలన నిమిత్తం మూడు రోజుల పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆమె సోమవారం పెబ్బేరు లోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు అతిథి గృహంలో కలెక్టర్ శ్వేతామహంతి, జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశమై జలశక్తి అభియాన్ కార్యక్రమంపై సమీక్షించారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కింద ఉపాధి హామి ద్వారా నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

ఇందులో భాగంగా ఊటకుంటల నిర్మాణం, ఉధ్యాన తోటల పెంపకం, చెక్ డ్యాములు, నర్సరీల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి కార్యక్రమాల ద్వారా నీటి సంరక్షణతో పాటు భూగర్భ జలాల పెంపు నకు కృషి చేయడం జరుగుతుందన్నారు. జలశక్తిఅభియాన్ కార్యక్రమాన్ని విస్తరించే అంశమై ఆమె కలెక్టర్ తో పాటు ఇతర అధికారులతో సమావేశమయ్యారు.ముఖ్యంగా జలశక్తి అభియాన్ కింద తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించడంపై దృష్టి సారించాలని ,తుంపర, బిందుసేధ్యం, కూరగాయలు పండించేం దుకు తక్కువ నీటి వినియోగం అవుతుందని, అందువల్ల అలాంటి వాటిపై జిల్లా రైతుల దృష్టిని మళ్లిం చాల్సిన అవసరం ఉందన్నారు. శాస్త్రీయ పద్దతిలో ఉన్న నీటిని వినియోగిచుకున్నట్లయితే తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించవచ్చని సూచించారు.

మదనాపురం సమీపంలోని కెవికె కేంద్రం సహకారంతో ఉధ్యాన వన తోటల గ్రాప్టింగ్‌పై దృష్టి సారించాలని కోరారు. జలశక్తి అభియాన్ కార్యక్రమం కింద ఉపాధి హామి పనులతో పాటు శాస్త్ర పద్దతిలో నీటి వినియోగం, తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించి అధిక దిగుబడులు సాధించడం వంటి కార్యక్రమాలను అదనపు నిధులు అవసరం ఉందని కలెక్టర్ శ్వేతామహంతి అదనపు కార్యదర్శి డాలి చక్రవర్తికి విజ్ఞప్తి చేవారు.

ఇందుకు స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి ఈ విషయమై డిపిఆర్‌ను తయారు చేసి వారంరోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని వాటి పరిశీలన అనంతరం అదనపు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశం లో డిఆర్‌డిఒ గణేష్, జిల్లా వ్యవసాయాధికారిణి సుజాత, జిల్లా ఇరిగేషన్ అధికారి శ్రీనివాసులు, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.

There should be awareness on water conservation