Friday, April 26, 2024

కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోతే.. ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా సమస్య ఉండదు

- Advertisement -
- Advertisement -

cm kcr

 

హైదరాబాద్ : కరోనాపై సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మరో ముగ్గురికి కరోనా సోకినట్టు సిఎం కెసిఆర్ ప్రకటించారు. నిన్న (మార్చి 28)న 67 కేసులు ఉండగా, ఈ రోజుకి ఆ సంఖ్య 70కి పెరిగింది. అయితే, కరోనా పాజిటివ్ నుంచి 11 మంది కోలుకున్నారని,  వారిని రేపు డిశ్చార్జ్ చేస్తారని సిఎం కెసిఆర్ ప్రకటించారు. తమకు అందిన సమాచారం ప్రకారం అందరూ కోలుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటి నుంచి తెలంగాణలో కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోతే, ఏప్రిల్ 7 నాటికి ఒక్క కరోనా కేసు కూడా రాష్ట్రంలో ఉండదని సిఎం కెసిఆర్ చెప్పారు. క్వారంటైన్‌లో ఉన్న 27వేల 937 మందిపై నిఘా ఉంది. కరోనా నయం అయిన 11 మందిని సోమవారం డిశ్చార్జ్ చేస్తారని ప్రకటించిన సిఎం కెసిఆర్.. ఆ తర్వాత 58 మంది  బాధితులు ఉంటారని ప్రకటించారు. ఇప్పటికే ఒకరు కరోనా బాధితుడు కోలుకుని ఇంటికి వెళ్లాడు. ఆయన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మన్ కీ బాత్‌లో కూడా మాట్లాడాడు. ఈ విషయాన్ని సిఎం కెసిఆర్ ప్రస్తావించారు.

కొత్త కేసులు చేరే అవకాశం రాష్ట్రానికి చాలా తక్కువ ఉందని సిఎం కెసిఆర్ చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయలు, పోర్టులు కూడా బంద్ అయ్యాయి కాబట్టి, కొత్త కేసులు వచ్చే సంఖ్య తక్కువన్నారు. లోకల్‌గా ఉన్న వారి ద్వారా కరోనా వ్యాపిస్తేనే కొత్త కేసులు నమోదవుతాయన్నారు. వారిని కూడా సీరియస్‌గా అబ్జర్వేషన్‌లో పెట్టామని సిఎం కెసిఆర్ చెప్పారు. కొత్త కేసులు రావొద్దని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ప్రస్తుతం భారత్ పాటిస్తున్న లాక్ డౌన్‌ను ప్రపంచం వ్యాప్తంగా ఉన్న సైన్స్ మేధావులు అందరూ ప్రశంసిస్తున్నారని సిఎం కెసిఆర్ చెప్పారు.

 

There will be no corona issue after April 7th
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News