Friday, April 19, 2024

తబ్లిగీలవి తప్ప కొత్తవి లేనట్లే!

- Advertisement -
- Advertisement -

corona cases

 

రేపటితో పూర్తికానున్న విదేశాల నుంచి వచ్చిన వారి క్వారంటైన్ పీరియడ్
అంతా అనుకున్నట్టు జరిగితే 25వేల మందికి వీడనున్న కరోనా నిర్బంధం
మర్కజ్‌లింకులను గుర్తించేందుకు ఆశా వర్కర్లకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇక నుంచి కొత్త కరోనా కేసులు ఉండవని వైద్యాధికారులు చెబుతున్నారు. వి దేశాల నుంచి వచ్చిన వారికి మంగళవారం తో ఇంక్యూబేషన్ పీరియడ్ ముగియనుం ది. దీంతో కేసులు పెరిగే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. మర్కజ్ లింక్ మినహా కొత్త కేసులు నమోదయ్యే ఆస్కారం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. వైరస్ లక్షణాలు కనిపించే 14 రోజుల వ్యవధి మంగళవారంతో పూర్తికానుండటంతో క్వారంటైన్‌లో ఉన్న వారు ఊపీరి పీల్చుకుంటున్నారు. గత నెల 22న ప్రారంభమైన లాక్‌డౌన్ నుంచి ఏప్రిల్ 7 వరకు వైరస్ ఇంక్యూబేషన్ పీరియడ్ ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు క్వారంటైన్‌లో ఉన్నవారికి ఎలాంటి అనుమానిత లక్షణాలు బయటపడలేదు. మరో రెండు రోజుల వరకు లక్షణాలు కనిపించకపోతే దాదాపు ప్రభుత్వ లక్షం 80 శాతం పూర్తవుతోంది. దీంతో సుమారు 25 వేల మందికి పైగా క్వారంటైన్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే విమానాలు కూడా పూర్తిగా రద్దు కావడంతో విదేశీ కొత్త కేసులు నమోదయ్యే పరిస్థితి లేదని వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆకస్మత్తుగా మర్కజ్ లింక్ ఆందోళన నెలకొల్పిన విషయం తెలిసిందే. దాదాపు ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల మొత్తంలో 80 శాతం ప్రార్థనల్లో పాల్గొన్న వారు, వారు సంబంధికులే ఉన్నారు. ఇప్పటికే అందరిని క్వారంటైన్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్రమంగా పాజిటివ్‌లు వస్తుండటంతో ప్రజలతో పాటు అధికారుల్లో కూడా అందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే మర్కజ్ ప్రార్ధనల్లో ప్రత్యక్షంగా పాల్గొన వారి ఇంక్యూబేషన్ పీరియడ్ కూడా మరో రెండు రోజుల్లో పూర్తికానుంది. దీంతో ఈ రెండు రోజులు నమోదయ్యే పాజిటివ్ కేసులు తప్ప, కొత్త కేసులు రావనే అభిప్రాయంతో అధికారులు ఉన్నారు. అయి తే మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని ప్రత్యక్షంగా కలసిన వ్యక్తులు, కుటుంబ సభ్యుల రిపోర్టులే ప్రస్తుతం కీలకంగా మారనున్నాయి.

ఇప్పటికే వీళ్ల ఆరోగ్య పరిస్థితులపై ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ వైద్యసిబ్బందికి తగిన సూచనలు చేస్తుంది. వీళ్ల నివేదికల్లో నెగటివ్ వస్తే సిఎం ప్రకటించినట్లు మరి కొన్ని రోజుల్లో కరోనా ఫ్రీ తెలంగాణ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుందని పలువురు వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే మరో రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, మరో 50వేలు పాజిటివ్ కేసులు వచ్చినా, వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు.

గ్రామాల్లో వేగంగా గుర్తింపు కార్యక్రమం..
మర్కజ్ లింక్‌ను గుర్తించేందుకు వివిధ జిల్లాల్లోని గ్రామాల్లో చర్యలు మరింత వేగవంతం అయ్యాయి. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎమ్‌లపై దాడులు చేస్తున్నా, అనుమానిత లక్షణాల వారిని గుర్తించేందుకు వెనుకాడటం లేదు. దాడులు జరుగుతున్నాయని సమాచారం తెలుసుకున్న వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రత్యేక భద్రతను కూడా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం నుంచి సర్వేలెన్స్ టీంలతో పాటు పోలీస్ అధికారులు కూడా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే మర్కజ్ నుంచి వచ్చిన బాధితులను గుర్తించడంలో ఆశాలు, ఏఎన్‌ఎమ్‌లు కీలక పాత్ర పోషించడంతో సిఎం మెచ్చుకున్నట్లు తెలుస్తోంది.

 

There will be no new corona cases in state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News