Home తాజా వార్తలు విశ్వవిజేతకు బ్రిటన్‌ ప్రధాని విందు

విశ్వవిజేతకు బ్రిటన్‌ ప్రధాని విందు

లండన్: ప్రపంచకప్ సాధించిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు బ్రిటన్ ప్రధాని థెరిసా మే ప్రత్యేక విందు ఇచ్చారు. డౌనింగ్ స్ట్రీట్‌లోని ఆమె కార్యాలయంలో ఇచ్చిన ఈ ప్రత్యేక విందులో ఇంగ్లండ్ క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులతో కలిసి ఫొటోలను దిగారు. మరోవైపు తాము గెలిచిన ట్రోఫీని ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్రధానికి చూపించారు. మరోవైపు ప్రధాని ఇచ్చిన విందులో క్రికెటర్లు చాలా సరదగా గడిపారు. సమష్టి పోరాటం వల్లే ఇది సాధ్యమైందని, జట్టు ప్రదర్శనను చూసి దేశం గర్విస్తుందని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో ట్రోఫీలను గెలుచుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

Theresa May meets England Cricket team