Home కరీంనగర్ దొంగ పోలీస్ అరెస్ట్…!

దొంగ పోలీస్ అరెస్ట్…!

donga..policeవాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ దొంగ..12 లక్షల 50 వేల విలువగల సొత్తు స్వాధీనం
కరీంనగర్ క్రైమ్ : కరీంనగర్ త్రిటౌన్ పోలీసులు నామాల నరేందర్ (23) అనే దొంగ పోలీస్‌ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దొంగ నుంచి పన్నెండు లక్షల యాభైవేల రూపాయల విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ డిఎస్పీ రామారావు దొంగను త్రిటౌన్ పోలీస్ స్టేషన్‌లో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. డిఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్ జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన నామాల నరేందర్ అలియాస్ చింటు హైదరాబాద్ లో ఎం.ఎ గ్రాడ్యూవెట్ పూర్తి చేశాడు. చూడటానికి ఆరడుగులు ఉన్న నరేందర్‌కు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరిక ఉండేది.

దీంతో తక్కువ సమయంలో ఎస్సై అయిపోవాలని భావించి…హైదరాబాద్‌లో సదరు దొంగ ఎయిర్ పిస్తాల్ కోలుగోలు చేసి తిరగి వేములవాడకు వచ్చాడు. అక్కడ స్థానికులకు తాను మానకొండూర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాని చెప్పుకొచ్చాడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న వారికి తాను వేములవాడ ఎస్సైగా పనిచేస్తున్నట్లు చెప్పేవాడు. సదరు దొంగను చూస్తే పోలీస్ లాగనే ఉండే సరికి అందరు నమ్మేశారు. అయితే ఎక్కువ రోజులు వేములవాడలో ఉంటే తన నిజస్వరూపం ఎక్కడ బయటపడుతుందో నని అక్కడ నుంచి హైదరాబాద్‌కు మకం మార్చాడు. హైదరాబాద్‌లో సదరు దొంగ చెప్పే మాటలు ఎవరు నమ్మకపోగా…హైదరాబాద్ లో పోలీసుల నిఘా ఎక్కువ ఉండటంతో…ఎయిర్‌గన్ చూపిస్తే దొరికిపోతానని భయంతో…జేబులో డబ్బులు లేకపోవడంతో అక్కడే నామాల నరేందర్ నిజా స్వరూపం బయట పెట్టాడు.

తన వద్ద నున్న మరో కళా…చోరకళాను బయటకు తీశారు. హైదరాబాద్‌లో చిన్న చిన్న వాహనలు దొంగలిస్తే ఎం వస్తుందని భావించి..మహంకళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏకంగా మహేంద్ర కంపెనీ చెందిన ఓ బోలెరో వాహనాన్ని దొంగలించాడు. దీంతో పాటుగా బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కరిజ్మా ద్విచక్ర వాహనం, కెబిహెబి కాలనీలో హోండ సైన్ , పంజగుట్టలో రాయల్ ఎన్‌ఫిల్డ్ బులెట్ దొంగలించాడు. సదరు దొంగ నరేందర్ హైదరాబాద్ లో దొంగలించిన వాహనాలను ఎవరు గుర్తు పట్టకుండా..కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేసి వెళ్లిపోయేవాడు. అదే విధంగా కరీంనగర్ త్రిటౌన్ పరిధిలోని ఖాన్ పుర ప్రాంతంలో మారుతి కారును, వావిలాలపల్లిలో హీరో ఫ్యాషన్ , అదే ప్రాంతంలో హోండా అవిటర్‌ను దొంగలించాడు.

కరీంనగర్ లో దొంగలించిన వాహనలు హైదరాబాద్‌లో అమ్మిసొమ్ముచేసుకునే వాడు. మరో వైపు నామాన నరేందర్ అలియాస్ చింటు వావిలాలపల్లిలో నివాసం ఉండే తమ బంధుల ఇంటికే కన్నం వేశాడు. వారు ఇంట్లో లేని సమయంలో బీరువాలో ఉన్న 5 తులాల బంగారు చైన్ దొంగలించుకొని పోయాడు. దీంతో బాధితులు త్రిటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా సోమవారం సాయంత్రం త్రిటౌన్ పోలీసులు మంచిర్యాల చౌరస్తా వద్ద వాహనలు తనిఖీలు చేస్తున్న సమయంలో దొంగలించిన ద్విచక్ర వాహనం పై నామాల నరేందర్ వస్తున్న సమయంలో పోలీసులు తనిఖీ చేసి బైక్ సంబంధించిన పత్రాలు అడగడంతో నరేందర్ మాట్లాడే మాటాలు పొంతన లేకపోవడంతో సదరు వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించడంతో ఇదివరకు తాను హైదరాబాద్‌లో, కరీంనగర్‌లో చేసిన దొంగతనాల గురించి చెప్పాడు. దీంతో త్రిటౌన్ సిఐ సదానందం నామాల నరేందర్ అలియాస్ చింటు పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.