Friday, April 19, 2024

స్కూటీ నుంచి డబ్బులు దొంగలించిన దొంగ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

భువనగిరి: గత నెల ఏప్రిల్ 10వ తేదిన జోగు మహేష్ తన భార్యాతో కలిసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భువనగిరి బ్రాంచ్ నందు లక్ష రూపాయలు విత్ డ్రా చేసుకొని తన మోటార్ సైకిల్ డిక్కీలో భద్రపరచుకొని, ఫోన్ మరిచి పోయాను అని మళ్లీ బ్యాంకులోకి వెళ్లి ఫోన్ వెతికి తన మోటార్ సైకిల్ దగ్గరికి వచ్చి చూసే సరికి డిక్కీ లో భద్రపరిచిన డబ్బులు కనిపించకపోవడంతో ఎంత వెతికిన లాభం లేకపోయేసరికి డిక్కీ తాళం పగలగొట్టి గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారని, భువనగిరి పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేశారు.

బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భువనగిరి పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టగా సోమవారం 11 గంటల సమయంలో నమ్మకమైన సమాచారం మేరకు భువనగిరి పట్టణంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆవరణలో అనుమానంగా తిరుగుతున్న అనకాపల్లి జిల్లా గొల్లుపేట మండలం కేడిపల్లి గ్రామం ఎస్సీ కాలానికి చెందిన ఘంటా శ్రీకాంత్‌గా గుర్తించారు. నిందితుని అదుపులో తీసుకొని విచారించగా స్కూటీ నుండి లక్ష రూపాయలు తీసుకున్నట్లు నేరం ఒప్పుకున్నట్లు పట్టణ సీఐ సత్యానారయణ తెలిపారు. ఇతనితోపాటు ఇతని స్నేహితుడు కూడా నేరంలో భాగస్వామ్యం ఉన్నట్లుగా విచారణలో పోలీసులు వెల్లడించారు.

ఇతని స్నేహితుడు పరారీ లో ఉన్నట్లు తెలిపారు. నిందితుడ్ని కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. వీళ్ళిద్దరూ కూడా గతంలో పలు పోలీస్ స్టేషన్లో దొంగతనాల కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ బి వెంకటయ్య, క్రైమ్ సిబ్బంది కొండారెడ్డి, రమేష్, లను ఏసిపి సైదిరెడ్డి వెంకట్ రెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణ, డిసిపి ఎం రాజేష్ చంద్ర దొంగతనానికి సహకరించిన సిబ్బందిని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News