Saturday, April 20, 2024

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మరిపెడః తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మరిపెడ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అరెస్టుకు సంబంధించిన వివరాలను తొర్రూర్ డిఎస్‌పి ఏ. రఘు మరిపెడ పోలీస్ స్టేషన్‌లో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా కదిరి గ్రామానికి చెందిన పొలసాని శివకుమార్ దొంగతనాలే ప్రవృత్తిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన తిరుపతి నుంచి హైదరాబాద్ రైలు మార్గంలో వెళ్తూ మార్గమధ్యలోని మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగాడు. అనంతరం స్టేషన్ సమీపంలో పార్క్ చేసి ఉంచిన టిఎస్ 05 ఈడి 9818 నెంబర్ గల పల్సర్ బైక్‌ను అపహరించి అదే బైక్‌పై మరిపెడ వైపు వస్తూ జాతీయ రహదారిపై గల సీరోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుజిలీ తండా శివారులోని కిరాణం షాపు పైకప్పు రేకును తనతో తెచ్చుకున్న కట్టర్‌తో కట్ చేసి లోపలికి వెళ్లి రూ. 2480 నగదును తస్కరించాడు. అక్కడి నుంచి అర్ధరాత్రి సమయంలో మరిపెడకు చేరుకున్నాడు.

అనంతరం బస్టాండ్ సమీపంలో ఉన్న విఆర్ సెల్ పాయింట్‌పై రేకుల కప్పును కట్ చేసి లోపలకు ప్రవేశించి 5 కీప్యాడ్ ఫోన్లు, ఒక వివో ఫోన్, 3 ఇయర్ బడ్స్, 3 స్మార్ట్ వాచ్‌లు, రూ. 6100 నగదు కౌంటర్‌ను నుంచి అపహరించి అట్టి బైక్‌పై యాదగిరి గుట్టకు వెళ్లి అక్కడే కొన్ని రోజులు ఉండి తిరిగి మరిపెడ వైపు వస్తుండగా మరిపెడ బంగ్లా కార్గిల్ సెంటర్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి పల్సర్ బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తుండగా వెంబడించి పట్టుకొని అదుపులోకి తీసుకొని విచారించగా మానుకోట, సీరోల్, మరిపెడ మండలాల్లో చోరీ చేసినట్లు అంగీకరించాడన్నారు. దొంగ నుంచి పల్సర్ బైక్, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, నగదు రూ. 6100, రేకులు కట్‌చేసే కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం విలువ సుమారు రూ. 1 లక్ష వరకు ఉంటుందని తెలిపారు. కాగా శివకుమార్ గత ఏడు సంవత్సరాల నుంచి జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాలోచనలతో ఆంధ్ర, తెలంగాణలోని గుంటూరు, నాగర్ కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూల్, నిజామాబాద్ జిల్లాలో వివిధ ప్రాంతాలలో దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లి, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అలవాటు ప్రకారం ఇళ్లలో, కిరాణం షాపులలో దొంగతనాలు చేస్తున్నట్లు డిఎస్‌పి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News