Home secunderabad చోరీలకు పాల్పడుతున్న నేరస్తుడి అరెస్టు

చోరీలకు పాల్పడుతున్న నేరస్తుడి అరెస్టు

Thief Arrested12 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం

సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తున్ని సికింద్రాబాద్ జిఆర్‌పి రైల్వే పోలీసులు అరెస్టు చేసి 12 లక్షల విలువ చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.  రైల్వే ఎస్‌పి జి. అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…. శ్రీకాకులం జిల్లాకు చెందిన ఆందవరపు పవన్ (29) నగరంలోని రామాంతపూర్‌లో నివాసముంటున్నాడు. చోరీలే వృత్తిగా పెట్టుకున్న పవన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫాంలపై, బుకింగ్ కౌంటర్ దగ్గర , రైళ్లలలో ప్రయాణికుల బ్యాగ్ లను చోరీ చేస్తూ.. అందులోని విలువైన వస్తువులను దొంగిలించి జల్సాలు చేస్తున్నాడు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు మంగళవారం రైల్వే సిఐ ఆదిరెడ్డి నేతృత్వంలోని క్రైం టీం ప్లాట్ ఫాం నెంబర్ 1 బుకింగ్ కౌంటర్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపలోకి తీసుకొని విచారించగా గతంలో అనేక చోరీ కేసుల్లో నిందితుడిగా తెలిందన్నారు. ప్రయాణికుల బ్యాగు జిప్పులను తొలగించి విలువైన వస్తువులను చోరీ చేస్తున్నట్టు తెలిపారు. నల్గొండ, కర్నూలు, సికింద్రాబాద్ తదితర రైల్వే స్టేషన్‌లలో గతంలో చోరీలకు పాల్పడట్టు తమ ధర్యాప్తులో తేలిందన్నారు. నిందితుడు పవన్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుండి 12 లక్షల విలువ చేసే 23.3 తులాల బంగారు ఆభరణాలు, రెండు లాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్‌పి జి, అశోక్ కుమార్ తెలిపారు.

 

Thief Arrested in Secunderabad