Home ఆంధ్రప్రదేశ్ వార్తలు కిరీటాల దొంగ అరెస్టు

కిరీటాల దొంగ అరెస్టు

Tirupati Urban SP Anuburajanతిరుపతి : తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయంలో బంగారు కిరీటాలను చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.  ఈ ఘటనపై తిరుపతి అర్బన్ ఎస్ పి అన్బురాజన్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై  80 రోజుల పాటు విచారణ చేశామని ఆయన తెలిపారు. ఈ కేసును ఛేదించేందుకు  ఆలయంలో ఉన్న 237 సిసి కెమెరాలను పరిశీలించామని ఆయన చెప్పారు. ఓ వ్యక్తి ఆలయంలో కిరీటాన్ని దొంగిలించడం సిసి కెమెరాలలో గుర్తించామని ఆయన పేర్కొన్నారు. నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖండార్ కు చెందిన ఆకాష్ గా గుర్తించామని ఎస్ పి తెలిపారు. స్నేహితుడితో కలిసి ఆకాష్ రేణిగుంట రైల్వే స్టేషన్ కు వచ్చాడని,  స్నేహితుడిని చెన్నయ్ కి  పంపించిన ఆకాష్ ఆలయంలో స్వామివారి కిరీటాన్ని చోరీ చేశాడని ఎస్ పి చెప్పారు.  ఆకాష్ నుంచి  1300 గ్రాముల బంగారు కడ్డీలను సీజ్‌ చేశామని ఎస్పి వెల్లడించారు.

Thief Arrested in Tirupati on Tuesday