Thursday, April 18, 2024

సంగారెడ్డిలో దొంగతనాలు.. జార్ఖండ్‌లో అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డిః ఇళ్లలో ఎవరు లేని సమయంలో రాత్రి పూట దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను జార్ఖండ్‌లో పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సంగారెడ్డి రూరల్ పోలీసులు తెలిపారు. మంగళవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్‌పి మాట్లాడుతూ… పోతిరెడ్డిపల్లికి చెందిన అనసూయ ఇంటికి తాళం వేసి సంక్రాంతి పండగకు జోగిపేటకు వెళ్లిందన్నారు. జవనరి 14,16వ తేదీ మధ్యలో తన ఇంటిలో దొంగతనం జరిగిందని 16వ తేదీన సంగారెడ్డి రూరల్ పోలీసులకు పిర్యాదు చేసిందన్నారు. సిసి కెమెరాల ఆధారంగా నేరస్థుడు ఝార్ఖండ్ రాష్ట్రం ధియోఘర్ జిల్లా మహాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిథికి చెందిన వాడిగా గుర్తించమన్నారు.

సంగారెడ్డి డిఎస్‌పి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ టీంను ఏర్పాటు చేసి ఝార్ఖండ్ రాష్ట్రానికి పంపామన్నారు. మంగళవారం నేరస్థుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 12లక్షల విలువైన 21తులాల బంగారు అభరణాలు సీతారామ హారం, బంగారు గాజులు, పుస్తెల తాడు, నల్లపూసలు, చెవి కమ్మలు, నెమలి పించం, ముత్యాల హారం, చింత గింజ పుస్తె,19తులాల వెండి అభరణాలు 1 0చైన్‌లు స్వాధీనం చేసుకొని కోర్టుకు రిమాండ్‌కు తరలించామన్నారు. నేరస్థుడిని పట్టుకునేందుకు కృషి చేసిన ప్రత్యేక బృందాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ శివలింగం, ఎస్‌ఐ,పోలీసు సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News