Home జాతీయ వార్తలు కాల్చిపారేశాడు…!(వీడియో)

కాల్చిపారేశాడు…!(వీడియో)

Open-Firingలక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మవు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దొంగతనానికి వచ్చిన ఓ ఆగంతకుడు తనకు అడ్డుపడిన వ్యక్తిని తుపాకీతో కాల్చిచంపాడు. నేరుగా షాప్‌లోకి చొరబడిన సదరు దొంగ వస్తు వస్తునే గన్ తీసి కౌంటర్‌లో ఉన్న వ్యక్తిపై గురిపెట్టాడు. దాంతో పక్కనే ఉన్న మరో వ్యక్తి దుండగుడిని ఆపేందుకు యత్నించాడు. ఇది గమనించిన దుండగుడు ఆ వ్యక్తిపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసికెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.