Saturday, April 20, 2024

దొంగతనానికి వచ్చి… రేకులు-చువ్వల మధ్య ఇరుక్కొని

- Advertisement -
- Advertisement -

Thief stuck in Petal and rod in Nizamabad

నిజామాబాద్: దేవాలయంలో దొంగతనానికి వచ్చి ఓ వ్యక్తి రేకుల మధ్య ఇరుక్కున్న సంఘటన నిజామాబాద్ జిల్లా ముబారక్ నగర్‌లోని మహాలక్ష్మి ఆలయంలో జరిగింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మెదక్ జిల్లాకు చెందిన రఘు కూలీ పనుల నిమిత్తం ఆర్మూర్‌లోని మామిడిపల్లికి వచ్చాడు. మహాలక్ష్మి ఆలయంలో దొంగతనానికి వచ్చి రేకులు, ఇనుపచువ్వల మధ్య ఇరుక్కున్నాడు. మిల్లుకు సెక్యూరిటీగా ఉన్న సుఖ్‌జిత్ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగను బయటకు తీసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతడిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News