Home తాజా వార్తలు గొంతుకోసి మహిళలను చంపిన దొంగలు

గొంతుకోసి మహిళలను చంపిన దొంగలు

Thief1అమరావతి: నెల్లూరులో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలు చిల్డ్రన్ పార్కు వద్ద ఓ ఇంట్లోకి చోరబడి ఇద్దరి మహిళలను దారుణంగా హత్య చేసి, మరో యువకుడిని తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం. గాయపడిన యువకుడిని స్థానిక ఆపోలో ఆస్పత్రిలో చేర్పించారు. స్థానికులు దొంగను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దొంగను అదుపులోకి తీసుకున్నారు. దుండగులు ఇంట్లోకి చోరబడి మహిళల గొంతుకోసి చంపారని పోలీసులు తెలిపారు.