Tuesday, January 31, 2023

విశాల హృదయంతో ఆలోచించండి

  • నైపుణ్య కార్మికుల వలసలను అడ్డుకోవద్దు
  • అమెరికాకు ప్రధాని మోడీ సూచన
- Advertisement -

PM-MODI-Trump-H1B

న్యూఢిల్లీ : నైపుణ్యంగల వృత్తి పనివారి విషయంలో మరింత దూరదృష్టితో, పొంతనతో వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారంనాడు అమెరికాపై ఒత్తిడి తె చ్చే వాఖ్యచేశారు. భారత్‌కు నష్టం కలిగించే విధంగా హెచ్1బి వీసాలను కోతకోయడానికి ట్రంప్ పాలనాయం త్రాంగం ప్రయత్నిస్తున్న సమయంలో మోడీ ఈ విధమైన చర్య తీసుకున్నారు. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధివర్గానికి ఇక్కడ స్వాగతం పలుకుతూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. అమెరికా పార్లమెంట్ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ ద్వైపాక్షిక సంబంధాలలో వారి రాక శుభసూచకమని ప్రధాని అన్నారు. అమెరికా కాంగ్రెస్‌లో, పాలనాయం త్రాంగంలో చోటు చేసుకున్న మార్పులు ద్వైపాక్షిక మైత్రి మెరుగుకు దారితీస్తాయన్న ఆశాభావాన్ని ఆయన ప్రకటిం చారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఫోన్ సంభాషణలో సానుకూలత వ్యక్తమైందని మోడీ గుర్తు చేసుకున్నారు. గత రెండున్నర ఏళ్లుగా అమెరికా-భారత్ సంబంధాలు మరిం త పటిష్టమయ్యాయన్నారు. అమెరికా-భారత్ భాగస్వా మ్యం కాంగ్రెస్ మద్దతుతో మరింత గట్టిపడు తుందని ఆయన శాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల ప్రజలమధ్య సంబంధాలు పటిష్టమౌతున్న ఫలితంగా ఇరుదేశాల పురో భివృద్ధికి ఊతం దొరికిందని మోడీ అన్నారు. భారతదేశపు నైపుణ్యంగల వృత్తి పనివారు అమెరికా ఆర్థిక పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ తనెల అధికా రం చేపట్టగానే భారతీయ టెక్ సంస్థలు, అ మెరికాలోని వృత్తినిపుణులు నష్టపోయే విధంగా హెచ్1బి వీసాల కుదింపునకు ట్రంప్ నిర్ణయించి కలకలం లేపారు.

24న అమెరికాకు భారత సంస్థలు

భారతీయ ఐటి సంస్థలన్నీ కలిసి ఒక లాబీగా ఏర్పడి 24వ తేదీన అమెరికాను సందర్శించనున్నాయి. అమెరికాలో హెచ్1బి వీసాలపై నిబంధనలను కఠినతరం చేసే ప్రతి పాదన ఉండడంతో వీరు అమెరికా వెళ్లాలని నిశ్చయించు కున్నారు. వీరు ట్రంప్ కార్యవర్గాన్ని కలుసుకొని ఇరుదే శాల మధ్య నైపుణ్యం ఉన్న మానవవనరుల రాకపోకలకు అవకాశాలపై చర్చించనున్నారు. భారతీయ ఐటీ రంగం అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ సృష్టికి, ఉద్యోగ రక్షణకు చేస్తున్న కృషిని వివరిస్తామని నాస్‌కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేందర్ సింగ్ తెలిపారు. దీనిపై నాస్‌కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘భారతీయ ఐటీ పరిశ్రమ అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి ఎంతో మేధోసంప త్తిని తీసుకొస్తోంది అనే విషయం అక్కడి వారికి వివరిస్తా’ మని తెలిపారు. భారతీయ ఐటీ రంగం అమెరికా నుంచి 65శాతం(155బిలియన్ డాలర్ల)ఆదాయాన్ని పొందుతోం ది. మొట్టమొదటి సారి భారతీయ ఐటీ రంగం అనిశ్చితి కారణంగా 2017-18లో మందకొడిగా ఉంటుందని ఇప్పటికే నివేదికలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles