Home తాజా వార్తలు మూడో మోటర్ వెట్ రన్ సక్సెస్

మూడో మోటర్ వెట్ రన్ సక్సెస్

Kaleshwaram Projectపెద్దపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ధర్మారం మండలం నందిమేడారం భూగర్భంలో నిర్మించిన పంప్‌హౌస్‌లోని మూడో మోటర్ వెట్ రన్ విజయవంతమైందని అధికారులు తెలిపారు. మూడో పంపు వెట్ రన్‌ను నీటి పారుదల శాఖ ఈఎస్ వెంకటేశ్వర్లు, సిఎం ఒఎస్‌డీ శ్రీధర్ రావ్ దేశ్ పాండే, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు  బుధవారం ఉదయం ప్రారంభించారు. వెట్ రన్ విజయవంతం కావడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం నాలుగో మోటర్ వెట్ రన్‌ను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింకు-2లో భాగంగా నంది మేడారం వద్ద అండర్ టన్నెల్‌లో భారీ పంపు హౌస్ నిర్మించారు. ఈ టన్నెల్ కు  వచ్చిన నీటిని పక్కనే ఉన్న మేడారం రిజర్వాయర్‌లో ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌లో ఏడు భారీమోటర్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. త్వరితగతిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి అవుతండడంపై అధికారులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Third Motor Wet Run Success At Kaleshwaram Project